iDreamPost
android-app
ios-app

తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త! డిప్యూటీ CM నిర్ణయంతో తల్లిదండ్రులు హ్యాపీ!

  • Published Aug 28, 2024 | 3:24 PM Updated Updated Aug 28, 2024 | 3:24 PM

Minister Bhatti Vikramarka: తెలంగాణ రాబోయే రోజుల్లో క్రీడారంగానికి పెద్ద పీట వేయబోతున్నట్లు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు శుభవార్త చెప్పారు.

Minister Bhatti Vikramarka: తెలంగాణ రాబోయే రోజుల్లో క్రీడారంగానికి పెద్ద పీట వేయబోతున్నట్లు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు శుభవార్త చెప్పారు.

తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త! డిప్యూటీ CM నిర్ణయంతో తల్లిదండ్రులు హ్యాపీ!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నూటిని నూరు శాతం అమలు చేస్తాం అంటూ పలు మీటింగ్స్‌లో చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ప్రారంభించారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తాజాగా తెలంగాణ విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ అందించారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఎంప్లాయిస్ కి ఆటల పోటీలను నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తునన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులు క్రీడారంగంలో రాణించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ లో తప్పని సరిగా స్పోర్ట్స్ పీరియడ్ ని ఏర్పాటు చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి తమకు ఇష్టమైన క్రీడల్లో మంచి అనుభవాన్ని గడించి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి స్ట్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అని అన్నారు.

హైదరాబాద్ సిటీలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.. ఇక్కడ క్రీడలను నిర్వహించాలని ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. క్రీడల అభివృద్దికి ఎటువంటి నిధులకు కొరత లేదని.. అవసరమైన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని వివరించారు. మంచి ఫిట్ నెస్ గా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. మూడు రోజుల ఈ ఆటలు కొనసాగుతాయని.. ఈ నెల 29 న ముగుస్తాయని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు.