Swetha
హైదరాబాద్ మహా నగరంలో జనాభా నానాటికి పెరుగుతూ ఉండడంతో.. నగర శివార్లలో కొత్త సిటీలను రూపొందించేనుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
హైదరాబాద్ మహా నగరంలో జనాభా నానాటికి పెరుగుతూ ఉండడంతో.. నగర శివార్లలో కొత్త సిటీలను రూపొందించేనుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Swetha
హైదరాబాద్ మహా నగరం గురించి అందరికి తెలిసిందే. ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది ప్రజలు హైదరాబాద్ కు ఉపాధి కోసం వస్తూ ఉంటారు. అలానే ఉన్నత చదువులు కోసం ఎంతో మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు..టెక్ సంస్థలకు పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ నివసించేవారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇలా ఎంత మంది ఎక్కడి నుంచి వచ్చినా వారందరిని.. హైదరాబాద్ మహా నగరం సాదరంగా ఆహ్వానిస్తూనే ఉంటుంది. కాబట్టి నానాటికి హైదరాబాద్ లో జనాభా పెరుగుతూ ఉంటారే కానీ తరగరు. ఇప్పటికే ఉన్న జనంతో.. అటు ట్రాఫిక్ కష్టాలు, పొల్యూషన్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ కష్టాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేలా.. HMDA హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీస్ నిర్మించేందుకు సిద్ధం అయింది.
కాగా, ఈ విషయమై గత ప్రభుత్వానికి తన ప్రతిపాదనను వెల్లడించారు అధికారులు. కానీ, అటు నుంచి ఎటువంటి స్పందన లభించలేదు. కానీ, ఇప్పడు ప్రభుత్వం మారడంతో.. మరల ఈ ప్రాజెక్ట్ ను వెలుగులోకి తీసుకుని వస్తున్నారు. ఇలా హైదరాబాద్ నగర శివార్లలో కొత్త సిటీలను నిర్మించడం వలన .. నగరంలో పెరుగుతున్న రద్దీ, పొల్యూషన్, ట్రాఫిక్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు కూడా బాగుపడతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో నగర శివార్లలోని 11ప్రాంతాలలో మినీ సిటీలను అభివృద్ధి చేయాలనీ భావిస్తున్నట్లు.. ఒక ఉన్నత అధికారి వెల్లడించారు.
ఈ క్రమంలో ఇబ్రహీం పట్నం, తుర్కపల్లి ప్రాంతాలను మినీ నగరాలుగా.. అభివృద్ధి చేస్తే బావుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలి అనుకుంటోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే రూపొందించినట్లుగా సమాచారం. ఇందులో బ్యాంకులు , హోటళ్లు, షాపింగ్ మాల్స్ లాంటివి నిర్మిస్తే .. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే, ఈ నగరాలూ అభివృద్ధి చెందాలంటే.. కనీస సదుపాయాల కల్పనకు.. అవసరమైన నిధులను ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి త్వరలోనే ఆసక్తి కలిగిన వారి నుంచి టెండర్లను ఆహ్వానించాలని కూడా HMDA సూచించింది.
ఇక ఇప్పటికే అనేక విషయాల కారణంగా.. నగర శివారు ప్రాంతాలలో.. హద్దులు లేకుండ సిటీ భూములకు ఇంకాస్త డిమాండ్ పెరుగుతూ పోతుంది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భూమినీ కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. దీనితో భవిష్యత్తులో భూమిని కొనుగోలు చేయడం మరింత కష్టంగా మారనుంది. కాబట్టి మినీ సిటీలను నిర్మించేందుకు ఇదే సరైన సమయం అని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇలా నగర శివార్లలో మినీ సిటీలను నిర్మించడం వలన హైదరాబాద్ పై నిజంగానే ఒత్తిడి తగ్గుతుందని చెప్పి తీరాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.