iDreamPost
android-app
ios-app

టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెగా DSC నోటిఫికేషన్ విడుదల

టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త. ఎప్పటి నుంచో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తాజాగా విద్యాశాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త. ఎప్పటి నుంచో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తాజాగా విద్యాశాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెగా DSC నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. పాత నోటిఫికేషన్ ను రద్దు చేసిన విద్యాశాఖ నేడు అనగా 29 ఫిబ్రవరి 2024న కొత్త నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీలు 6,508 భర్తీ చేయనున్నారు.

పీఈటీ 182, లాంగ్వేజ్ పండిట్ 727, స్కూల్ అసిస్టెంట్ 2,629, స్కూల్ అసిస్టెంట్( స్పెషల్ ఎడ్యుకేషన్) 220, ఎస్జీటీ( స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు మార్చి 04 నుంచి ఏప్రిల్ 02 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అప్లికేషన్ ఫీజు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

కాగా 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, ఇతర కారణాల చేత భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా ఆ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ కొత్తగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.