Nidhan
మేడారం జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు సుదూరాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి మేడారానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో జాతరకు వస్తున్న ఓ బస్సులో కొందరు ప్రయాణికులు చేసిన పనికి అంతా షాకవుతున్నారు.
మేడారం జాతర అత్యంత వైభవంగా సాగుతోంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు సుదూరాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి మేడారానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో జాతరకు వస్తున్న ఓ బస్సులో కొందరు ప్రయాణికులు చేసిన పనికి అంతా షాకవుతున్నారు.
Nidhan
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారక్క మహా జాతర వైభవంగా సాగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చిన్నాపెద్దలనే తేడా లేకుండా అంతా జంపన్న వాగులో మునుగుతున్నారు. ఆ తర్వాత అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు. భక్తజనం భారీగా రావడంతో వనం మొత్తం జనంతో నిండిపోయింది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా భక్తులు వస్తున్న నేపథ్యంలో.. టీఎస్ఆర్టీసీ స్పెషల్గా 6 వేల బస్సుల్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాల నుంచి మేడారానికి సర్కారు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని ప్యాసింజర్లు గట్టిగానే వాడేస్తున్నారు. అయితే కొందరు ప్రయాణికులు బస్సుల్ని మిస్ యూజ్ చేస్తున్నారు.
మేడారానికి వెళ్తూ కొందరు ప్రయాణికులు బస్సులో చేసిన పనికి అంతా షాకవుతున్నారు. చుట్టూ లేడీ ప్యాసింజర్స్ ఉన్నారనేది కూడా చూడకుండా వాళ్లు చేసిన పనికి ఏంటి సామి ఇదని అంటున్నారు. సమ్మక్క సారక్క జాతర కోసం ఏర్పాటు చేసిన ఒక ఆర్టీసీ బస్సులో కొందరు యువకులు ఏకంగా బార్ తెరిచేశారు. మందుబాటిళ్లు ముందు పెట్టుకొని దర్జాగా కూర్చొని గ్లాసులో మందు పోసుకొని తాగారు. కంఫర్ట్ కోసం మరికొందరు యువకులు బస్సులో కింద కూర్చొని పెగ్గులు వేశారు. అయితే ఆ బస్సులో కొందరు మహిళా ప్రయాణికులు కూడా ఉన్నారు. అయినా ఆ ప్రబుద్ధులు మాత్రం ఎంచక్కా మందేస్తూ చిల్ అయ్యారు. యువకులు బస్సును బార్గా మార్చేసి, మద్యం తాగుతున్న వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
బస్సులో యువకులు మద్యం తాగుతున్న వీడియోలను చూసిన నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. మేడారానికి వెళ్తూ ఇదేం పని అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీతో పాటు పోలీసులకు కూడా ట్యాగ్ చేస్తూ కంప్లయింట్ చేస్తున్నారు. స్త్రీలు, పిల్లలు ఉన్న బస్సులో ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని.. ఆ యువకులపై తగిన చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, మేడారం జాతరకు వెళ్లేవారు అమ్మవార్ల దర్శనం తర్వాత కోడి, మేకలు కోస్తూ మొక్కులు తీర్చుకోవడం కామనే. కొందరు మేడారంలో దావత్ చేసుకుంటే మరికొందరు ఇళ్లకు వచ్చాక చుట్టాలతో కలసి గ్రాండ్గా పార్టీ చేసుకుంటారు. కానీ ఇలా బస్సులోనే తోటి ప్రయాణికులు అందులోనూ పిల్లలు, మహిళలు చుట్టూ ఉండగా కూర్చొని మందేయడం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి.. బస్సులో యువకులు మందేసిన ఈ ఘటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు. pic.twitter.com/bIq3d1ElVz
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2024
ఇదీ చదవండి: ఆ ఉద్యోగాల విషయంలో CM జగన్ దారిలో రేవంత్!