P Krishna
Massive Fire Mishap: ఈ మద్యకాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలంలో తరుచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం తెలిసిందే.
Massive Fire Mishap: ఈ మద్యకాలంలో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలంలో తరుచూ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం తెలిసిందే.
P Krishna
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. చాలా వరకు ఈ ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్స్ వల్ల జరుగుతున్నాయి. సాధారణంగా కెమికల్, బాణా సంచా, ప్లాస్టీక్ ఫ్యాక్టరీల్లో ఫైర్ సేఫ్టీ తప్పకుండా ఉంచాలనే నిబంధన ఉంది. అలాగే కాటన్ గోదాములు, టింబర్ టిపోలు, వస్త్ర సముదాయాల్లో తప్పని సరిగా ఫైర్ సేఫ్టీ ఉంచుకోవాలి. కానీ కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నా సకాలంలో వాటి నుంచి రక్షించుకోలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ గండిపేట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్లకు సంబంధించిన ఒ షెడ్ లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసి పడటంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు నానా తంటాలు పడ్డారు. ఈ ఘటనలో గోదాం పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో మనుషులు అక్కడ లేరని.. కాకపోతే 25 కార్లు మాత్రం పూర్తిగా కాలి బూడిదయ్యాయని యజమాని తెలిపారు. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగి ఉండవొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అధిక వేడిమి వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే వేసవి కాలంలో గోదాములు, ఫ్యాక్టరీలు, అపార్ట్ మెంట్స్, మాల్స్ లో తప్పని సరిగా ఫైర్ సేఫ్టీ ఉంచాలని సూచిస్తున్నారు. ఈ రోజు ఎండ మరీ ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్ని కీలలు ఎగసి పడటంతో కార్లు వెంట వెంటనే కాలిపోయాయి. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.