iDreamPost
android-app
ios-app

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు!

  • Author Soma Sekhar Updated - 12:08 PM, Mon - 13 November 23

హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

  • Author Soma Sekhar Updated - 12:08 PM, Mon - 13 November 23
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు!

హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు సజీవదహనం అయ్యారని, మరికొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. మంటలు అంతకంతకు పెరుగుతూ నాలుగు అంతస్థుల వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

నగరంలోని నాంపల్లి బజార్ ఘాట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ రసాయనిక గోదాంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మంటల్లో సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. కాగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మంటలు వ్యాప్తిస్తూ.. నాలుగు అంతస్తుల భవనం మెుత్తం వ్యాపించాయి.

దీంతో అపార్ట్ మెంటో లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మందిని రక్షించారు డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది. కాగా.. జనావాసాల మధ్యలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఘాటైన రసాయానాల వాసనలు, దట్టమైన పొగలు స్థానికంగా ఉండే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉండే వారిని సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు. మంటలు అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి