iDreamPost
android-app
ios-app

మగాళ్లకు RTC బస్సుల్లో స్పెషల్ సీట్లు ఇవ్వాలంటూ యువకుడి నిరసన!

TS RTC: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ యువకుడు తమకు కూడా ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరి.. ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

TS RTC: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ యువకుడు తమకు కూడా ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరి.. ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

మగాళ్లకు RTC బస్సుల్లో స్పెషల్ సీట్లు ఇవ్వాలంటూ యువకుడి నిరసన!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మహిళకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి అనే స్కీమ్ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంతో ఈ స్కీమ్ పై మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది. భారీ సంఖ్యలో ఆడవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు మగవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక యువకుడు అయితే బస్సు ముందు నిల్చొని తన నిరసన తెలియజేశాడు. మరి.. ఆ యువకుడి డిమాండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహాలక్ష్మి పేరుతో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి జీరో టికెట్స్ ను కూడా మహిళలకు ఇష్యూ చేస్తుంది ఆర్టీసీ సంస్థ. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని మహిళలు బాగానే వినియోగించుకుంటున్నారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. భారీగా ఆడవాళ్లు ఆర్టీసీ బస్సులో ఎక్కుతుండటమే అందుకు నిదర్శనంగా. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సంఖ్యలో లేడీసే కనిపిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటో ఎక్కువ సీట్లలో వారే కూర్చుంటున్నారు. దీంతో చాలా మంది పురుషుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే బయటకు చెబితే తమ పరువే పోతుందని మౌనంగా ఉంటున్నారంట.

ఈ నేపథ్యంలో కొందరు..పురుషులకు కూడా ప్రత్యేక సీట్లు కేటాయిస్తే బాగుంటుందనే డిమాండ్ కూడా చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు బస్సు ముందు నిల్చొన్ని తన నిరసనను తెలియజేశాడు. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆ యువకుడు డిమాండ్ చేశాడు. సదరు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడు మాట్లాడుతూ…మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని, దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, మగవారికి బస్సుల్లో వసతి లేకుండా పోయిందని వాపోయాడు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనని, తన భార్య, తల్లి కూడా అలానే ప్రయాణిస్తున్నారని తెలిపాడు. అయితే మగవారికి కోసం సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి బస్సుల్లో కనీసం 15 సీట్లు మగవారి కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. రేవంత్ రెడ్డి సార్ అంటే నాకు ఇష్టమేనని, అయితే మగవారి కోసం కూడా ఆలోచించాలని ఆ వ్యక్తి తెలిపాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.