Dharani
మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పారు. దీనిపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మల్లారెడ్డి చెప్పిన ఆ శుభవార్త ఏంటంటే..
మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ ప్రజలకు శుభవార్త చెప్పారు. దీనిపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మల్లారెడ్డి చెప్పిన ఆ శుభవార్త ఏంటంటే..
Dharani
నేటి కాలంలో నాణ్యమైన విద్య, వైద్యం దొరకడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. మరీ ముఖ్యంగా ఆస్పత్రి ఖర్చులు సామాన్యులను భయపెడుతుంటాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్దామంటే.. అక్కడ అరకొర సౌకర్యాలు, సిబ్బంది నిర్లక్ష్యం.. ధైర్యం చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయినా సరే చాలా మంది అప్పు చేసి మరీ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తుంటారు. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అంటే.. ఆ ఖర్చు గురించి అసలు మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. అయితే అన్ని ఆస్పత్రులు కాసుల కోసమే కక్కుర్తి పడవు. కొందరు కార్పొరేట్ హస్పిటల్ యాజమాన్యం.. సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు ఉచితంగానే వైద్య సేవలు అందిస్తాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఈ కోవకు వచ్చే కార్పొరేట్ ఆస్పత్రి గురించే. నగరవాసులెవరైనా ఇక్కడ ఉచిత వైద్యం పొందవచ్చు. ఇంతకు ఆ ఆస్పత్రి ఎక్కడ ఉందంటే..
ఇన్నాళ్లుగా కేవలం స్థానిక ప్రజలకు మాత్రమే ఉచిత వైద్య సేవలు అందిస్తోన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి.. ఇకపై హైదరబాద్ నగర ప్రజలందరికి ఫ్రీ కార్పొరేట్ వైద్యం అందించేందుకు రెడీ అవుతోంది. మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి, వైఎస్ చైర్మన్ ప్రీతి రెడ్డి ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘గత పద్నాలుగేళ్లుగా మల్లారెడ్డి హాస్పిటల్ తరపున ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. అయితే ఇప్పటి వరకు ఈ సేవలను మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజలే ఎక్కువగా వినియోగించుకున్నారు. ఇక నుంచి హైదరాబాద్ ప్రజలకు మా ఆస్పత్రిలో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందిస్తాము’’ అని తెలిపారు.
ఇప్పటికే ఈ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ విభాగం తరపున ప్రసూతి సేవలు ఉచితంగా అందిస్తుండగా.. ఇకనుంచి అమ్మాయి పుడితే 5 వేల రూపాయల డీడీతో పాటు కేసీఆర్ కిట్ లాగే సీఎంఆర్ కిట్‌ను ఇవ్వనున్నట్లు ప్రీతి రెడ్డి తెలిపారు. చిన్న పిల్లలకు వచ్చే వ్యాధులకు చికిత్సతో పాటు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు, బ్రెయిన్, స్కిన్, ఆర్థో పెడిక్, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ వంటి అన్ని డిపార్ట్‌మెంట్‌లలో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. మంచి ఎక్విప్‌మెంట్‌తో, సీనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉచిత సేవలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కనుక హైదరాబాద్ ప్రజలందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ప్రీతి రెడ్డి.
ఈ ఆస్పత్రి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందినది. ఆయనకు నగరంలో అనేక ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇక మల్లారెడ్డి ఎప్పటి నుంచో తన కార్పొరేట్ ఆస్పత్రిలో పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు నగరవాసులందరిని ఈ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మల్లన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.