iDreamPost
android-app
ios-app

తెలంగాణలో దొంగ మల్లన్న ఆలయం.. ఆ పేరు ఎలా వచ్చిందంటే!

Jagtial Mallanna Temple: మన దేశంలో ఎన్నో శివ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అలానే తెలంగాణలో దొంగ మల్లన్న ఆలయం ఉంది. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో అందరికి ఆశ్చర్యంగా ఉంది. మరి.. ఆ వివరాలు..

Jagtial Mallanna Temple: మన దేశంలో ఎన్నో శివ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అలానే తెలంగాణలో దొంగ మల్లన్న ఆలయం ఉంది. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో అందరికి ఆశ్చర్యంగా ఉంది. మరి.. ఆ వివరాలు..

తెలంగాణలో దొంగ మల్లన్న ఆలయం.. ఆ పేరు ఎలా వచ్చిందంటే!

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లల్లో శంకరుడు ఒకరు. ఆయనను భోళా శంకరుడు, గరళకంఠుడని అనేక పేర్లతో పిలుస్తుంటారు. శివ పురాణం ప్రకారం.. ఆయనకు 1008 పేర్లు ఉన్నాయి. అలానే లెక్కలేనన్ని రూపాలు, అవతారాలు ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో ఆ శివుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని చాలా మంది నమ్ముతుంటారు. ఇక భూమి మీద అనేక ప్రాంతాల్లో శివాలయాలు ఉన్నాయి. అంతేకాక శివుడు ఆవిర్భవించిన ఈ ఆలయాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో వెలసిన శివుడిని దొంగ మల్లన్న అని పిలుస్తారు. అదేంటి దొంగ అని పేరు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోకండి!. ఆ ఆలయం పేరు వెనుక పెద్ద చరిత్ర ఉంది. 

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో ఓ శివాలయం ఉంది. దీనిని అందరూ దొంగ మల్లన్న ఆలయం అని పిలుస్తుంటారు. ఈ గుడిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దం చివర్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇక్కడి చరిత్ర ప్రకారం.. పొలాస పాలకులకు చెందిన ఆవులను కొంతమంది దొంగలు దొంగిలించారట. వాటిని దొంగతనంగా తీసుకెళ్తున్న సమయంలో.. మార్గం మధ్యలో స్థానికులు ఆ దొంగలను గుర్తించారట. దీంతో వారికి చిక్కుతామనే భయంతో దొంగలు.. అక్కడే ఉన్న మల్లిఖార్జునస్వామిని శరణు వేడుకున్నారంట.

అంతేకాక తమను గుర్తించకుండా ఆవుల రంగు మారిస్తే ఆలయం కట్టిస్తామని మొక్కుకున్నారంట. దొంగల మొరను ఆలకించిన ఆ శివయ్య… వారిని స్థానికుల నుంచి కాపాడటంతో ఆ దొంగలంతా కలిసి రాత్రికి రాత్రే మల్లన్నకు గుడిని నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. దొంగలు కట్టించారు కాబట్టి ఈ ఆలయానికి దొంగ మల్లన్న ఆలయంగా పేరు వచ్చింది. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. మార్గశిర మాసం శుద్ధ పంచమి నాడు మల్లన్న కల్యాణం జరుగుతుంది. దండివారం, నాగవెల్లితో ప్రారంభమయ్యే జాతర..మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు షష్టి వరకు కొనసాగుతుంది.

జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వరంగల్, నిజామాబాద్ కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా గొల్లకురుమలు ఎక్కువ సంఖ్యలో ఈ గుడికి వస్తుంటారు. దీంతో ఈ క్షేత్రంలోని మల్లన్న గొల్లకురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందాడు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఈ మల్లన్న జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 11వ తేదీ వరకూ జాతర జరగనుండగా, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరి.. దొంగ మల్లన్న ఆలయంలానే మీకు తెలిసిన విచిత్రమైన ఆలయాల గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.