iDreamPost
android-app
ios-app

TS RTC: జర్నీ ఫ్రీ అయినా.. జీరో టికెట్ ఎందుకు? అసలు కారణం ఇదే!

తెలంగాణలో మహిళకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జీరో టికెట్ ను ఇష్యూ చేస్తున్నారు. మరి... ఫ్రీ జర్నీ అయితే.. ఈ జీరో టికెట్ఎందుకు అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

తెలంగాణలో మహిళకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జీరో టికెట్ ను ఇష్యూ చేస్తున్నారు. మరి... ఫ్రీ జర్నీ అయితే.. ఈ జీరో టికెట్ఎందుకు అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది.

TS RTC: జర్నీ ఫ్రీ అయినా.. జీరో టికెట్ ఎందుకు? అసలు కారణం ఇదే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ సారి ఎన్నికల్లో ఓటమిపాలైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. వాటిలో ఒకటి.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ పథకానికి  మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. శుక్రవారం నుంచి వారికి జీరో టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. మరి.. ఉచిత ప్రయాణం అయితే ఈ జీరో టికెట్ ఎందుకు అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహాలక్ష్మి స్కీమ్ కి అనుహ్య స్పందన వస్తుంది. గురువారం వరకు ఎటువంటి  టికెట్ లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్ వేర్ ను సంస్థ అప్ డేట్ చేసింది. ఆ సాఫ్ట్ వేర్ ను టిమ్ మిషన్ లో ఇన్ స్టాల్ చేయడం జరుగుతోంది. ఈ మిషన్ ల ద్వారా నేటి నుంచి జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేస్తోంది. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి. తప్పకుండా ప్రతి మహిళా విధిగా బస్సులో జీరో టికెట్ తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్స్ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా మహిళా ప్రయాణికులకు ఎలాంటి సమస్యలకు తలెత్తకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి, అందుబాటులో తెచ్చిన అధికారులను ఆయన అభినందించారు.

ఉచిత ప్రయాణం అయితే జీరో టికెట్  ఎందుకు అని చాలా మంది మహిళలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బలమైన కారణం ఉందని తెలుస్తుంది. బస్సులో ఎంత మంది మహిళలు ప్రయాణిస్తున్నారు, ఎన్ని జీరో టికెట్లు ఇష్యూ అవుతున్నాయి అని తెలుసుకునేందుకు దీనిని అమలు చేస్తున్నారు. అంతేకాక ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఈ జీరో టికెట్లు ఇష్యూ అవుతున్నాయి అనే విషయం తెలుస్తుంది. మహిళలు ఏ  స్థాయిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారో, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఈ జీరో టికెట్ ను ఇష్యు చేస్తున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక ఈ జీరో టికెట్ ఇవ్వడం ద్వారా పలు గణాంకాలు తెలుస్తాయని అంటున్నారు. ఇది కేవలం ఆర్టీసీలో ప్రయాణికులు ఏ స్థాయిలో ఉన్నారని తెలుసుకునేందుకు. మరి.. మహిళలకు టీఎస్ ఆర్టీసీ జీరో టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.