మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. ఆటో డ్రైవర్ల సమస్యలు మా దృష్టికి వచ్చాయి : పొన్నం ప్రభాకర్

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరింది. ఆయన అధికారంలోకి రాగానే.. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలందరికీ.. బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఈ పథకం..

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరింది. ఆయన అధికారంలోకి రాగానే.. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలందరికీ.. బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఈ పథకం..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మానిఫెస్టోలో పేర్కొన్న హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఈ హామీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్. ఆధార్, ఓటర్ వంటి గుర్తింపు కార్డు చూపిస్తే సరి ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందవచ్చు. సిటీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ బస్సులకు ఈ పథకం వర్తిస్తుంది. గుర్తింపు కార్డును కండక్టర్ కు చూపిస్తే చాలు.. ఎక్కడికి వెళ్లాలో చెబితే.. జీరో టికెట్ అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు రాష్ట్రంలోని మహిళలు. హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు.

ఈ మహాలక్ష్మి పథకం ఆటో, క్యాబ్ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఆటోలు ఎక్కడం మానేశారని, తమ పొట్ట ఎట్లానిండాలని ఆందోళన చేపట్టారు ఆటో డ్రైవర్లు. తమకు ఓ ఫ్యామిలీ ఉంటుందని, ఈ ఆటోను తమకు జీవనాధారమని ఆవేదన చెందారు. ఇప్పుడు ఆటోలు నడపలేకపోతున్నామని, ఫైనాన్స్ ఎలా కట్టేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం వచ్చినప్పటి నుండి గిరాకీలు ఉండటం లేదని, డబ్బులు రావడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నామని, ఫ్యామిలీని ఎలా బతికించుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే తమకు నెలకు రూ. వెయ్యి చొప్పున భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు, యూనియన్ లీడర్లు పలు చోట్ల ధర్నాలు, నిరసనలు చేయగా.. అరెస్టులు చోటుచేసుకున్నాయి.

కాగా, ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 19న మంగళవారం ప్రజా భవన్‌లో ప్రజా వాణి కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ రోజు 5,126 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చాలా మంది సొంత ఇల్లు లేదని వచ్చారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వాళ్ల సమస్యలు కచ్చితంగా పరిష్కారం చేస్తాం. మహిళలు ఉచితంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం వల్ల.. ఆటో డ్రైవర్లకు గిరాకీల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండండి’ అంటూ చెప్పారు.

Show comments