Krishna Kowshik
హైదరాబాద్ నగరంలో షాపింగ్ మాల్స్ కు కొదవ లేదు. ఇక్కడ ఏడాదికి నాలుగు ఐదు కొత్త మాల్స్ వెలుస్తుంటాయి. ఇవి వస్తున్నాయంటే చాలు చిరు, వీధి వ్యాపారులకు బెంగ పట్టుకుంటుంది. తాజాగా.. లులు మాల్ కారణంగా
హైదరాబాద్ నగరంలో షాపింగ్ మాల్స్ కు కొదవ లేదు. ఇక్కడ ఏడాదికి నాలుగు ఐదు కొత్త మాల్స్ వెలుస్తుంటాయి. ఇవి వస్తున్నాయంటే చాలు చిరు, వీధి వ్యాపారులకు బెంగ పట్టుకుంటుంది. తాజాగా.. లులు మాల్ కారణంగా
Krishna Kowshik
పెద్ద చేప వచ్చి చిన్న చేపను మింగేసినట్లు అవుతుంది నేడు మాల్స్-వీధి వ్యాపారుల పరిస్థితి. నగరంలో ఇప్పుడు మాల్స్‌దే హవా. పెద్ద పెద్ద భవనాలను నిర్మించి.. ఏ టు జెడ్ అన్ని అక్కడే దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మాల్ జస్ట్ చూద్దామని, లేదా విండో షాపింగ్ చేద్దామని వెళుతున్న వాళ్లు.. అక్కడే ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అద్దాల మేడలు, హంగులు, ఆర్భాటాలు చూసి సామాన్యులు సైతం షాపింగ్ క్లాంప్లెక్స్‌కు వెళుతున్నారు. దీంతో చిరు, వీధి వ్యాపారుల బిజినెస్ దెబ్బతింటోంది. గతంలో కూడా మాల్స్ వెలుస్తుడటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఈ వ్యాపారులు. తాజాగా ఓ ప్రముఖ వ్యాపార కూడలిలో చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు అధికారులు.
అదే హైదరాబాద్ నగరంలో ఇటీవల అతిపెద్ద మాల్ వెలిసింది.. కూకట్ పల్లిలోని ఉన్న ఈ మాల్ ఓపెనింగ్ రోజైతే.. జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ట్రాఫిక్ జామ్ దగ్గర నుండి షాపింగ్ మాల్‌లో దొరికినోడు.. దొరికినంత తినేసి.. అక్కడే చెత్తను పడేయంతో.. మాల్ కాస్త..కుప్ప తొట్టిలా మారిన సంగతి విదితమే. కొంపేదో మునిగిపోయినట్లుగా.. తొలి రోజే భారీ ఎత్తున ఆ షాపింగ్ కాంప్లెక్స్ చూసేందుకు క్యూ కట్టారు. ఇదిలా ఉంటే.. దీన్నే అనుకుని.. అక్కడ వీధి వ్యాపారులు బిజినెస్ చేసుకుంటున్నారు. సుమారు 200 మందికి పైగా వ్యాపారాలు చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత 30 ఏళ్లుగా అక్కడే బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆక్రమించారన్న పేరుతో వాటిని తొలగించారు అధికారులు.
ఇక్కడ ఫుట్ పాత్ పై చిరు వ్యాపారం చేసుకుంటున్న వారిపై అధికారులు కన్నెర్ర చేశారు. సోమవారం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ వ్యాపారాలను తొలగించారు. సుమారు 200లకు పైగా వ్యాపారాలను తొలగించినట్లు సమాచారం. దీంతో వీరి కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఫుట్ పాత్ ఆక్రమిస్తున్నారన్న నెపంతో వీటిని తొలగించారు. ఇక్కడ చిరు వ్యాపారుల బిజినెస్ వల్ల ఇక్కడ రద్దీ నెలకొంటుంది. రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో అటు వెళ్లాలంటే నరకంగా మారింది. దీంతో ఈ దుకాణాలను తొలగించినట్లు తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండా ఇటువంటి చర్యలకు అధికారులు పాల్పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.