iDreamPost
android-app
ios-app

చారిత్రాత్మక కట్టడంపై పాడు పనులు.. అందరి ముందే..!

చారిత్రాత్మక కట్టడంపై పాడు పనులు.. అందరి ముందే..!

హైదరాబాద్‌ నగరంలో ప్రేమ జంటలు పెచ్చు మీరి విలయ తాండవం చేస్తున్నాయి. పార్కులు, గుట్టలు, పొదలు, పర్యాటక ప్రదేశాలు కావేవీ మా సరదాలకు అనర్హం అ‍న్నట్లుగా ప్రవర్తిన్నాయి. హైదరాబాద్‌కు తలమానికం అయిన చార్మినార్‌ను కూడా వదలటం లేదు. పర్యటనకు పోయి పాడు పనులు చేస్తున్నారు. వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాన్ని ఓయో రూముగా మార్చేస్తున్నారు. పైన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎంత మంది ఉన్నా తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

దీంతో పర్యాటకుల ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. రాత్రి వేళల్లో కొందరు ప్రేమికులు దురుసుగా ప్రవర్తించడం, గొడవలు పెట్టుకోవటం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చార్మినార్‌ వెళ్లే రహదారులను పోలీసులు అర్థరాత్రి వేళ మూసివేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నిరాశ తప్పటం లేదు. చార్మినార్‌ను దూరంనుంచి చూసి చీకట్లో సెల్ఫీలు దిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. తాము ఎంతో ఆశతో చార్మినార్‌ను చూడ్డానికి చాలా దూరం నుంచి వస్తున్నామని, కానీ, తమకు నిరాశ తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, చార్మినార్‌ను రాత్రిపూట అందంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇల్యూమినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడాది పొడవునా ప్రతీరోజు సాయంత్రం ప్రత్యేక దీపాలు వెలిగించనున్నట్ల ఆయన తెలిపారు. ఇక, ఈ కార్యక్రమంలో భాగంగా చార్మినార్‌ వద్ద 190 వాట్ల ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. పర్యాటకులతో నిత్యం కలకల్లాడాల్సిన చార్మినార్‌ ప్రేమికుల కారణంగా వెలవెలబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి, చార్మినార్‌పై బరి తెగిస్తున్న ప్రేమ జంటలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.