iDreamPost
android-app
ios-app

Barrelakka: MPగా పోటీ చేస్తున్న బర్రెలక్క.. ఏ నియోజకవర్గం నుంచంటే..?

Barrelakka.. Lok Sabha Elections 2024.. యువత తరుఫున గళాన్ని విప్పి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది బర్రెలక్క అలియాస్ శిరీష. సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ఓ అమ్మాయి.. అప్పటి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ వేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఎంపీగా పోటీకి సిద్ధమౌతుంది.

Barrelakka.. Lok Sabha Elections 2024.. యువత తరుఫున గళాన్ని విప్పి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది బర్రెలక్క అలియాస్ శిరీష. సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ఓ అమ్మాయి.. అప్పటి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయ వేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఎంపీగా పోటీకి సిద్ధమౌతుంది.

Barrelakka: MPగా పోటీ చేస్తున్న బర్రెలక్క.. ఏ నియోజకవర్గం నుంచంటే..?

‘బర్రెలు కాయడానికి వచ్చాను ఫ్రెండ్స్’ అంటూ ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది శిరీష. దీంతో బర్రెలక్కగా ముద్ర పడిపోయింది. అప్పుడు నుండి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేస్తూ పేరు తెచ్చుకుంది. కానీ ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది పొలిటికల్ ఎంట్రీ. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయం ఉద్దండులను సైతం ఆశ్చర్యపరిచింది. బెదిరింపులు, దాడులను తట్టుకుని యువత గొంతుకగా మారింది. ఓడిపోయిన ఆగిపోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి.. సంచలనంగా మారింది.

అంతలో ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. వెంకటేశ్ అనే వ్యక్తిని మనువాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి చూపులు, ఎంగేజ్ మెంట్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, పెళ్లి వీడియోలు ఒక్కొక్కటిగా తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేస్తూ మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఈ మధ్యలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లి హడావుడిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న విషయం శిరీష మర్చిపోయిందేమో అనుకున్నారంతా. కానీ తాను చెప్పినట్లుగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇంతకు ఆమె ఎక్కడ నుండి పోటీ చేస్తుందంటే.? తన సొంత జిల్లా నుండే. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతోంది.

ఇదే నియోజవర్గం నుండి ఇటీవలే బీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. బీజెపీ నుండి పి. భరత్, ఇక అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా డా. మల్లు రవి పోటీ చేస్తున్నారు. ఈ రాజకీయ ఉద్దండుతలతో తలపడుతోంది మన శిరీష.. అలియాస్ బర్రెలక్క. అయితే ఈ ఎన్నికల కోసం కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేయించుకున్నట్లు తెలిపింది. ఆ పాట లింక్ కూడా తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఇటీవల పెళ్లి కోసం ఓ ప్రత్యేక మైన సాంగ్ క్రియేట్ చేయించుకున్న సంగతి విదితమే. అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు ఈ ఎన్నికల కోసం కూడా మంచి సాంగ్ క్రియేట్ చేయించుకుంది. ‘కదిలిందిరా ఓ మహిళ.. కదనరంగంలో జ్యోతిలా.. రాజకీయ రంగంలో ఎదిగి, ఒదిగి వెలిగిందిరా’ పాట సాగుతోంది. నెల క్రితం తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసింది.

ఈ పాట వినడానికి చాలా స్ఫూర్తివంతంగా ఉంది. మొత్తానికి శిరీష ముందు చెప్పినట్లే  ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి.. మరోసారి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా, పెళ్లైన తర్వాత బర్రెలక్క ఓ ఎమోషనల్ పోస్టు చేసిన సంగతి విదితమే ‘ ఒక అమ్మాయికి గాయం అయితే.. గాయం చేసిన వాళ్లను ఏమీ అనరు.. అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు.. మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారు.. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు’ అంటూ రాసిన ఎమోషనల్ పోస్టును ఇన్ స్టాలో స్టేటస్‌లో షేర్ చేసుకుంది బర్రెలక్క.