Dharani
Election 2024: రేపటి నుంచి హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీసు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాటిని ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని.. జైలుకే అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..
Election 2024: రేపటి నుంచి హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీసు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాటిని ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని.. జైలుకే అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..
Dharani
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరానికి నేటితో ఎండ్ కార్డ్ పడనుంది. మే 13 సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పోలింగ్‌కు 24గంటల ముందు నుంచి మైక్‌లు మూగబోతాయి. గ్రామాల సంగతి మినహాయిస్తే.. చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తారు. ఈ క్రమంలో రేపటి నుంచి అనగా మే 11, శనివారం నుంచి హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మే 14 ఉదయం 6 గంటల వరకు ఈ నియమాలు అమల్లో ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు..
మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండటంతో.. రేపటి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాటిని ఉల్లంఘిస్తే.. జైలుకే అంటున్నారు అధికారులు. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 14 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పోలింగ్ రోజున.. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక పోలింగ్ రోజున అనగా మే 13వ తేదీన పోలింగ్ కేంద్రంఓ ఓటర్లు రెండు క్యూలైన్లలో ఉండాలని.. ఆడవారికి, మగవారికి వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయని అధికారులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించనమి సీపీ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసిన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు ఒపెన్ చేయకూడదు అన్నారు. దీని ప్రకారం ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు రాష్ట్రంలో వైన్స్ బంద్ చేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అలానే జూన్ 4న అనగా ఓట్ల లెక్కింపు రోజున సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. ఒకవేళ రీపోలింగ్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని వెల్లడించారు. పోలింగ్, కౌంటింగ్ రోజున కచ్చితంగా మద్యం డ్రై డేను అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సీఈవో స్పష్టం చేసింది.