iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి హోటల్ చికెన్ బిర్యానిలో బల్లి

  • Published Dec 03, 2023 | 8:47 AM Updated Updated Dec 03, 2023 | 8:47 AM

హైదారబాద్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఇక్కడ బిర్యానీ తినడానికి సెలబ్రెటీలు, క్రీడాకారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎంతో ఇష్టపడతారు.

హైదారబాద్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఇక్కడ బిర్యానీ తినడానికి సెలబ్రెటీలు, క్రీడాకారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎంతో ఇష్టపడతారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి  హోటల్ చికెన్ బిర్యానిలో బల్లి

ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా హైదరాబాద్ కి వచ్చారంటే ఖచ్చితంగా బిర్యానీ రుచి ఆస్వాదించాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ అంటే అంత ఫేమస్. ఎంతోమంది విదేశీయులు హైదరాబాద్ బిర్యానీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇక హైదరాబాద్ కి వచ్చే సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ముందు బిర్యారీ తర్వాత ఏదైనా పని అంటారు. హైదరాబాద్ లో బావర్చి బిర్యానీ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బావర్చి బిర్యానీ హూటల్స్, రెస్టారెంట్స్ ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజూ ఎన్నో ఆర్డర్లు వెళ్తుంటాయి. ఆన్ లైన్ డెలివరీ మొదలైన తర్వాత బావర్చి బిర్యానికి మరింత డిమాండ్ పెరిగింది. బావర్చి బిర్యాని లో బల్లి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన శనివారం రాత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో బావర్చి బిర్యాని ఎంత ఫేమస్ అన్న అందరికీ తెలుసు. వీక్ ఎండ్ వస్తే చాలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వెళ్లి బిర్యానీ రుచి ఆస్వాదిస్తారు. ఇక్కడ చికెన్, మటన్ బిర్యానీ అంటే ఎంతో ఫేమస్. ఇటీవల బావర్చి బిర్యానీ నుంచి ఆన్ లైన్ ఆర్డర్లు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హైటల్ నుంచి అంబర్ పేట డీడీ కాలనీకి చెందిన విశ్వ ఆదిత్య అనే వ్యక్తి జొమాటో యాప్ ద్వారా బిర్యానీ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడు. బిర్యానీ తిందామని ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా కస్టమర్ ఒక్కసారే షాక్ తిన్నాడు. బిర్యానీలో బల్లి కనిపించడంతో వెంటనే హూటల్ కి ఫోన్ చేసి తన బిర్యానీలో బల్లి వచ్చిందని ఫిర్యాదు చేశాడు. అతని కాంప్లెంట్ విన్న హూటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా వెళ్లి హూటల్ యాజమాన్యానికి చూపించినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటంతో ఆదిత్య కుటుంబ సభ్యులు హూటల్ ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో ఫేమస్ హూటల్ అని శుచీ, శుభ్రత ఉంటుందని బిర్యానీ ఆర్డర్ చేస్తే.. బల్లి రావడం చూసి ఆందోళన చెందామని.. ఆ విషయం హూటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లే ఏమాత్రం పట్టించుకోకపోవడం తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని ఆదిత్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిక్కడపల్లి పోలీసులు వెళ్లి బావర్చి హూటల్ వద్ద ఆందోళనను సర్ధుమనిగేలా చేసి వారిని వెనక్కి పంపించారు. హైటల్ ని మూయించారు. ఈ ఘటనపై హైటల్ సిబ్బంది స్పందించాల్సి ఉంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.