Tirupathi Rao
Wine Shops Close: మందు బాబులకు ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అందింది. ఆ రోజు మద్యం దుకాణాలు బంద్ చేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Wine Shops Close: మందు బాబులకు ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అందింది. ఆ రోజు మద్యం దుకాణాలు బంద్ చేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Tirupathi Rao
మండే ఎండలకు రాష్ట్రంలో మద్యం ప్రియులు అంతా చల్లని బీర్లు తాగుతూ సేదతీరుతున్నారు. అయితే ఒకవైపు బీర్ల కొరత వారిని బాగా ఇబ్బంది పెడుతోంది. ఇలా బీర్లు దొరకడం లేదని అసంతృప్తితో ఉన్న మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్ అందింది. ఈ నెల 17న హైదరాబాద్ లో వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలపాటు హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు బంద్ కావాల్సిందేనంటూ ఆదేశించారు. ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరవాలని చూసినా.. తెరిచినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే మద్యం ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్న మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ 24 గంటల పాటు హైదరాబాద్ జంట నగరాల్లో ఎలాంటి మద్యం అమ్మకాలు జరగకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ సీపీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
శ్రీరామనవమి అనేది తెలుగు వారికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఎంతో విశిష్టమైన పండుగ. కావున ఆ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో పండుగ శోభ వెల్లి విరుస్తుంది. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత సీతాసమేత రాములవారు అయోధ్యకు తిరిగి వచ్చింది ఆ రోజే అని.. ఆ రోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఆ విశిష్టమైన రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో రాముల వారికి కల్యాణం, పట్టాభిషేకం నిర్వహిస్తారు. అందుకే అలాంటి రోజున హైదరాబాద్ జంట నగరాల్లో ఎలాంటి అవాఛనీయమైన చర్యలు జరిగేందుకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ హైదరాబాద్ సీపీ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీరామ నవమి రోజు హైదరాబాద్ జంట నగరాల్లో ఎక్కడా మద్యం దుకాణాలు తెరిచేందుకు వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వైన్స్, బార్లు, కల్లు కాంపౌండులు తెరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల యజమానులు, పౌరులు అంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.