iDreamPost
android-app
ios-app

మద్యం ప్రియులకు షాక్.. రెండ్రోజులు లిక్కర్ షాప్స్ బంద్!

  • Published Jul 04, 2024 | 6:09 PM Updated Updated Jul 04, 2024 | 6:09 PM

మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం అని ఫీల్ అవుతున్న లిక్కర్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ నెలలో రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.

మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం అని ఫీల్ అవుతున్న లిక్కర్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్. ఈ నెలలో రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.

  • Published Jul 04, 2024 | 6:09 PMUpdated Jul 04, 2024 | 6:09 PM
మద్యం ప్రియులకు షాక్.. రెండ్రోజులు లిక్కర్ షాప్స్ బంద్!

ఈ మధ్య కాలంలో మందు బాబులకు ఎంత చిక్కొచ్చి పడిందో. గతంలో స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత్ర్య దినోత్సవానికి, గాంధీ జయంతికి మాత్రమే మద్యం దుకాణాలు బంద్ అయ్యేవి. మిగిలిన రోజులన్నీ డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేసి.. పీకల దాకా తాగి ఎంజాయ్ చేసేవారు. పెళ్లాం, బిడ్డలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని పోషించేవారు మద్యం కొనుగోలు చేసి. రోజుకో సారి భార్య మొహాన్నైనా చూడకుండా ఉండగలరేమో కానీ.. బార్ షాపులను చూడకుండా ఉండలేరు. సాయంత్రం అయితే నోరు, కళ్లు, మనస్సు అన్నీ అటువైపు లాగేస్తుంటాయి. ఇక జేబు నిండా డబ్బులు ఉండాలే గానీ.. సాయంత్రం ఏం కర్మ.. పొద్దున్న గుర్తుకు వచ్చేస్తుంది మద్యం షాపు. పని ఏదో ఉన్నట్లు చక్కగా రెడీ అయ్యి.. దుకాణం ఓపెన్ కాకుండానే.. అక్కడ ప్రత్యక్షమవుతుంటారు మందుబాబులు.

రోజుకు ఒక్క పెగ్గు అయినా పుచ్చకోనిదో నిద్ర పట్టదు కొంత మందికి. కానీ ఇటీవల కాలంలో వరుసగా మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. గతంలో కొన్ని ప్రత్యేకమైన రోజులకు మాత్రమే షాపులు మూసివేశారు. ఇటీవల హనుమాన్ జయంతికి, ఎన్నికల ముందు, ఫలితాలు వెలువడే రోజు అబ్బో ఇలాంటి రోజులన్నీ దుకాణాలు మూతపడిపోతుంటే.. దిగులు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. అదేంటంటే.. ఈ నెలలో కూడా రెండు రోజుల పాటు మందు దొరకదు. ఈ మేరకు కీలక ప్రకటన వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఆ రెండు రోజులు లిక్కర్ లవర్స్ కు మద్యం దొరకపోవచ్చు.. ఎందుకంటే…? రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి.

మద్యం ప్రియులకు మింగుడు పడని వార్త. జులై నెలలో ఆ రెండు రోజుల పాటు మందు దుకాణాలకు సెలవులు రాబోతున్నాయి. ఇంతకు ఆ రోజులు ఏంటంటే.. జులై 17, 27. జులై 17వ తేదీ మొహరం.. ఆ రోజు లిక్కర్ షాప్స్ మూతపడనున్నాయి. అలాగే జులై 27న బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రై డే రానుంది. ఈ రెండు రోజులు లిక్కర్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. జూలై నెలలో ఈ రెండు రోజుల్లో మద్యం ప్రియులకు చుక్క లిక్కర్ కూడా దొరికే అవకాశాలు లేవు. అసలే పండుగ వచ్చిందంటే.. ముక్కతో పాటు చుక్క పడనిదే నిద్రరాదు మద్యం హీరోలకు. మరీ ఈ రెండు రోజులు సెలవులు అయితే.. ఏం చేస్తారో.. ఏమిటో..?  ముందుగా స్టాక్ తెచ్చుకుని పెట్టుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా.?  ముందస్తుగా తెచ్చుకుని.. ముందు పెట్టుకుని ఉండగలరా..?

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom