P Krishna
Leopard Trapped: ఇటీవల అటవీ ప్రాంతాల్లో ఉండే వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్తితి నెలకొంటుంది.
Leopard Trapped: ఇటీవల అటవీ ప్రాంతాల్లో ఉండే వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్తితి నెలకొంటుంది.
P Krishna
ఒకప్పుడు అడవులు పచ్చగా ఉండేవి.. వన్య మృగాలకు ఆహాచం సమృద్దిగా లభించేది. ఎప్పుడైతే అడవులు నరికివేయడం మొదలు పెట్టారో.. వన్య మృగాలు చుట్టు పక్కల ఉండే గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చేస్తున్నాయి. చిన్న చిన్న జీవాలను చంపి తింటున్నారు. చాలా వరకు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాలు, పట్టణాల్లోకి చిరుత పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు మనుషులపై అటాక్ చేసి గాయపర్చడం, చంపేయడం జరుగుతుంది. అందుకే ప్రకృతిలో సమతుల్యాన్ని కాపాడలంటే పర్యావరణాన్ని రక్షించాలని అంటున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం రేపిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ చిరుత కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల అటవీ ప్రాంతాల్లో ఉండే కృర మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి.. అటవీ ప్రాంతాల్లో సరైన ఆహారం లభించక కొన్ని వన్య మృగాలు గ్రామాలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. మేకలు, ఆవులు, కోళ్లను పట్టి తింటున్నాయి. వీటి భారిన అప్పుడప్పుడు మనుషులు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం రన్ వే పై చిరుగ కనిపించడంతో అధికారులు షాక్ తిన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలో చిరుత కదలికలు గమనించి అధికారులు చుట్టు పక్కల నాలుగు బోనులు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకల మాసంతో పాటు కోడి మాంసం ఉంచారు. అయితే చిరుత బోను వద్దకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోడం అటవీ శాఖ అధికారులు, శంషాబాద్ ప్రజలు ఆందోళన కలిగించింది.
ఆపరేషన్ చిరుత కంటిన్యూ చేస్తూ వచ్చారు అధికారు. ఐదు రోజుల పాటు నానా తిప్పలు పడుతున్నారు అటవీ శాఖ అధికారులు. చిరుత మాత్రం బోనులో చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతూ వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారు జామున 2.15 గంటల ప్రాంతంలో బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి అర్ ఎం డోబ్రియల్ తెలిపారు.దీంతో అటు అటవీ అధికారులు, శంషాబాద్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చుట్టు పక్కల అటవీ ప్రాంతం తగ్గిపోవడం వల్ల జనావాసాల్లోకి కృరమృగాలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా తగు సంరక్షణ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.