Lal Darwaza Bonalu-Hyderabad Police Issue Traffic Advisory, Old City: ఆదివారం సరదాగా బయటకి పోతున్నారా? ఆ మార్గాల వైపు అస్సలు వెళ్లకండి!

Hyderabad: ఆదివారం సరదాగా బయటకి పోతున్నారా? ఆ మార్గాల వైపు అస్సలు వెళ్లకండి!

Lal Darwaza Bonalu-Hyderabad Police Issue Traffic Advisory, Old City: ఆదివారం కదా.. అలా సరదాగా బయటకు వెళ్దామని భావిస్తున్నారా.. అయితే ఆ మార్గాల వైపు అస్సలు వెళ్లకండి. ఎందుకంటే..

Lal Darwaza Bonalu-Hyderabad Police Issue Traffic Advisory, Old City: ఆదివారం కదా.. అలా సరదాగా బయటకు వెళ్దామని భావిస్తున్నారా.. అయితే ఆ మార్గాల వైపు అస్సలు వెళ్లకండి. ఎందుకంటే..

ఆదివారం వచ్చిందంటే చాలు నగర వాసులు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా బయటకు వెళ్లాలనుకుంటారు. మూవీస్‌, మాల్స్‌, పార్కులకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలని భావిస్తారు. ఆదివారం చాలా వరకు ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు కాబట్టి.. రోడ్లు కూడా కాస్త ఫ్రీగా ఉంటాయి. దాంతో బయటకు వెళ్లి రిలాక్స్‌ అవ్వాలనుకుంటారు. మరి రేపే ఆదివారం. మీరు కూడా ఇదే ప్లాన్‌తో ఉన్నారా.. అయితే ఆగండి. ఈ ఆదివారం మీరు బయటకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొండి. రేపు హైదరాబాద్‌ నగరం అంతా తిరగలేము. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మీకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకు.. అసలేం జరిగింది అంటే..

ఆషాఢమాసం వచ్చిదంటే చాలు.. భాగ్యనగరం బోనమెత్తుతుంది. రేపు అనగా జూలై 28, ఆదివారంతో బోనాల ఉత్సవాలు ముగింపుకు చేరుకుంటాయి. గత ఆదివారం సికింద్రాబాద్‌ బోనాలు నిర్వహించగా.. ఈ వారం.. పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు, నాయకులు, ప్రముఖులు వచ్చే అవకాశం ఉండటంతో.. నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అంతేకాక బోనాల రద్దీ దృష్టిలో పెట్టుకుని.. ఆదివారం నాడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు అధికారులు.

అలానే ఛత్రినాక ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం నుంచి అక్కన్న మాదన్న ఆలయం వరకు ఏనుగుపై ఘటాల ఊరేగింపు ఉంటుంది. దాంతో ఆది, సోమవారాలు అనగా జూలై 28, 29 తేదీల్లో ఫలక్‌నామా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహదూర్‌పరా పోలీస్‌ స్టేఫన్‌ల పరిధిలోని పలు ప్రాంతాల్లో, నయాపూర్‌ నుంచి అక్కన్నమాదన్న ఆలయం వరకు వాహనాల రాకపోకలపకై ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్‌ వైపునుంచి వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు.. చాంద్రాయణగుట్ట, కందికల్‌గేట్‌ ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఛత్రినాక ఔట్‌పోస్ట్‌ వైపు మళ్లిస్తూ.. ట్రాఫిక్‌ అధికారులు ఆంక్షలు విధించారు.

జులై 29న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలు ఇంజన్‌బౌలి, జహానుమా, గోశాల వైపు.. పంచ్‌మొహల్లా, చార్మినార్‌, వైపునుంచి వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్‌ వైపు మళ్లిస్తారు. చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చే వాహనాలను ఎస్‌జే రోటరీ, పురాణాహవేలి వైపు.. ఖిల్వత్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లి టీ జంక్షన్‌ నుంచి ఓల్గా జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు. అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్‌రోడ్స్‌, ఇంజన్‌బౌలి, గుల్జార్‌హౌస్‌, ఛార్మినార్‌, హిమ్మత్‌పురా, నాగులచింత రోడ్లపై ఎలాంటి వాహనాలను అనుమతించబోమని సిటీ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఇక లాల్‌దర్వాజా బోనాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 100 ప్రత్యక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది.

Show comments