iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ నోటి దురుసు! మహిళతో ఎంతమందిని కంటావ్ అంటూ!

Nalgonda Hospital Lady Doctor: నల్గొండ ప్రభుత్వాస్పత్రి మహిళా వైద్యురాలి వివాదం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చెకప్ కోసం వచ్చిన గర్భిణీని వైద్యురాలు దూషించడం చర్చనీయాంశం అయ్యింది.

Nalgonda Hospital Lady Doctor: నల్గొండ ప్రభుత్వాస్పత్రి మహిళా వైద్యురాలి వివాదం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. చెకప్ కోసం వచ్చిన గర్భిణీని వైద్యురాలు దూషించడం చర్చనీయాంశం అయ్యింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ నోటి దురుసు! మహిళతో ఎంతమందిని కంటావ్ అంటూ!

వైద్యో నారాయణే హరి అంటారు. అంటే ప్రాణాలు నిలబెట్టే వైద్యుడు ఆ నారాయణుడితో సమానం అని. అందుకే వైద్యులకు ప్రజలు ఎంతో మర్యాద, గౌరవం ఇస్తారు. వారిని దేవుడితో పోలుస్తారు. ఆ మర్యాదను, గౌరవాన్ని కొందరు నిలబెట్టుకున్నా.. మరి కొంతమంది మాత్రం ఆ వృత్తికే కళంకం తెస్తూ ఉంటారు. పేషెంట్స్ తో అమర్యాదగా ప్రవర్తించడం, వారిని అవమానిచడం చేస్తుంటారు. ఆరోగ్యం బాలేదని వారి వద్దకు వస్తే చులకనగా మాట్లాడతారు. తాజాగా అలాంటి ఒక ఘటనే తెలంగాణలో వెలుగు చూసింది. చెకప్ కోసం వచ్చిన ఒక గర్భిణిని మహిళా వైద్యురాలు దూషించిన ఘటన రాష్ట్రప్యాప్తంగా చర్చకు దారి తీసింది.

నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో దారుణన ఘటన వెలుగు చూసింది. చెకప్ కోసం వచ్చిన మహిళను మహిళా వైద్యురాలు దూషించింది. ఇంకా ఎంత మందిని కంటావ్ అంటూ కామెంట్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం అసలు ఏం జరిగిందంటే.. ఒక గర్భిణి చెకప్ కోసం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ ఉన్న మహిళా వైద్యురాలు ఆమెను చెకప్ చేసుందుకు పిలిచింది. లోపలికి వెళ్లిన తర్వాత చెకప్ చేస్తూ ఎన్నో కాన్పు అడిగింది. సదరు మహిళ తనది ఐదో కాన్పు అంటూ చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఆ మహిళా వైద్యురాలు అగ్గిమీద గుగ్గిళం అయ్యింది. ఆ మహిళను దూషించడం ప్రారంభించింది. నీకు సిగ్గు ఉందా అని అరవడంతో ఆ గర్భిణి బిత్తరపోయింది.

డాక్టర్ ఎందుకు అరుస్తోంది అర్థం కాలేదు. ఆమె ఇంకా ఎంత మందిని కంటావ్ అని కేకలు వేయడంతో గర్భిణికి విషయం అర్థమైంది. ఆ డాక్టరు అసభ్య పదజాలంతో దూషించినట్లు సదరు మహిళ ఆరోపణలు చేసింది. తనను నోటికొచ్చినట్లు మహిళా డాక్టర్ తిట్టందని చెప్తూ బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆస్పత్రిలో జరిగిన మొత్తం వ్యవహారాన్ని బాధితురాలు తన భర్తకు వివరించింది. విషయం తెలుసుకున్న భర్త ఆ మహిళా డాక్టర్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. చెకప్ కోసం వచ్చిన తన భార్యను వైద్యురాలు ఇష్టారీతిన మాట్లాడిందని, అసభ్య పదజాలంతో దూషించింది అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ వార్త విన్న తర్వాత నెటిజన్స్ కూడా ఆ లేడీ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీని అలా దూషించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి.. చెకప్ కోసం వచ్చిన గర్భిణీని దూషించిన మహిళా డాక్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetkare girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis