Dharani
Hyderabad Metro Stations: ఎల్ అండ్ టీ కంపెనీ.. ఐటీ సంస్థలకు బపంరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
Hyderabad Metro Stations: ఎల్ అండ్ టీ కంపెనీ.. ఐటీ సంస్థలకు బపంరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
Dharani
హైదరాబాద్ లో మెట్రో వచ్చిన తర్వాత.. రవాణా కష్టాలు చాలా వరకు తీరాయి. మెట్రో టికెట్ ధర కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. సామాన్యుల కన్నా కూడా ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో వల్ల బోలేడు లాభాలు కలుగుతున్నాయి. కిలోమీటర్ల కొద్ది దూరాన్ని నిమిషాల్లో చేరవేస్తూ.. అది కూడా చల్లని ఏసీ ప్రయాణం కావడంతో.. ప్రయాణం చేశామన్న అలసట లేకుండా ఉద్యోగులు కార్యాలయాలకు, ఇళ్లకు చేరుకుంటున్నారు. దీని వల్ల ఎంతో సమయం ఆదా అవుతోంది. ఇక తాజాగా ఎల్ అండ్ టీ కంపెనీ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఐటీ సంస్థలు, ఉద్యోగులకు మరింత మేలు జరగనుంది. ఇంతకు ఏంటా నిర్ణయం అంటే మెట్రో స్టేషన్లలోనే ఐటీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ వివరాలు..
విశాలమైన ప్రాంగణం, నిరంతర రవాణా సదుపాయం.. ఇలా అన్ని సౌకర్యాలున్న ఆఫీస్ స్పేస్ కోసం వెతుకుతున్నారా.. అయితే మీ కోసమేఎల్ అండ్ టీ సంస్థ ఓ ఆఫర్ ప్రకటించింది. నగరంలో మూడు ప్రధాన మెట్రో స్టేషన్లలో సురక్షితమైన రిమోట్ కో-వర్కింగ్ స్పెస్ కోసం ఆఫీస్ బబుల్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కాలంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతుండటాన్ని గుర్తించిన ఎల్ అండ్ టీ.. మెట్రో స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది హైదరాబాద్ పట్టణ రవాణా రంగంలో మొదటి వినూత్న ప్రయోగం అని చెప్పవచ్చు.
ఈ ఆఫీస్ బబుల్స్ ద్వారా ఎల్ అండ్ టీ సంస్థ హైదరాబాద్ లోని మెట్రో స్టేషనల్లో మీకు కావాల్సిన స్పేస్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ స్థలంలో ఎలాంటి ఆఫీసులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ ఆఫీసుల వంటి కమర్షియల్ కార్యాలయాలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉండనున్నాయి. ఆఫీస్ బబుల్స్ కోసం ఎల్ అండ్ టీ కంపెనీ గుర్తించిన మూడు మెట్రో స్టేషన్లు ఏవి అంటే.. హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్.
ఎల్ అండ్ టీ కంపెనీ ఈ మెట్రో స్టేషన్లలో 10వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ కొత్త విధానం రిమోట్ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఎల్ అండ్ టీ ఆఫర్ ను ఉపయోగించుకున్న మొదటి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ ‘ట్రెండ్జ్ వర్క్ స్పేస్ ’ అని ఆ కంపెనీ ప్రకటించింది.
ఎల్ అండ్ టీ కంపెనీ తీసుకువచ్చిన ఈ ‘‘ఆఫీస్ బబుల్స్’’ విధానంలో భాగంగా కస్టమర్లకు నచ్చేలా.. వేర్వేరు రకాల సైజుల్లో అందించేందుకు రెడీ అయ్యింది. రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా 1750 చదరపు అడుగుల స్థలాన్ని పొందవచ్చు. ఆఫీస్ బబుల్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని మొత్తం 49 మెట్రో స్టేషన్లలో స్థలాలను అందుబాటులో ఉంది. అంతేకాక 8 నాన్ టిపి కల్ మెట్రో స్టేషన్లలో 5వేల చదరపు అడుగుల నుంచి 30 వేల చదరపు అడుగుల వరకు లీజుకు తీసుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు ప్రయాణ భారం తగ్గుతుంది.. అని కంపెనీలు భావిస్తున్నాయి.