Dharani
Kumari Aunty: ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం వల్ల కుమారి ఆంటీ గురించి అందరికి తెలిసింది. సీఎం రేవంత్ ఆమె స్టాల్ వద్దకు వస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
Kumari Aunty: ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం వల్ల కుమారి ఆంటీ గురించి అందరికి తెలిసింది. సీఎం రేవంత్ ఆమె స్టాల్ వద్దకు వస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
Dharani
కుమారి ఆంటీ.. నాలుగు రోజుల క్రితం వరకు ఈమె గురించి కేవలం సోషల్ మీడియా వినియోగించే వారికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతో పోలీసులు ఆమె ఫుడ్ వ్యాన్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారో.. అప్పటి నుంచి కుమారి ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసింది. ఈ ఒక్క సంఘటనతో ఆమె క్రేజ్ ఎంతలా పెరిగింది అంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి సైతం కుమారి ఆంటీ వివాదంపై స్పందించి.. పోలీసులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక త్వరలోనే సీఎం రేవంత్.. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ని సందర్శిస్తారంటూ సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది.
దాంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లింది. పైగా కుమారి ఆంటీ వివాదం రాకజకీ రంగు పులుముకోవడం మరింత జనాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అయితే ఈ వివాదం సద్దుమణిగింది. కుమారి ఆంటీ మళ్లీ అదే స్థానంలో తన వ్యాపారం చేసుకోవడానికి అన్ని అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
తమ ఫుడ్ స్టాల్ సీజ్ చేసిన అంశంపై ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడంపై కుమారి ఆంటీ హర్షం వ్యక్తం చేసింది. తనలాంటి చిన్న ఫుడ్ స్టాల్ వ్యాపారం చేసుకునే సాధారణ మహిళను ఆదుకోవడానికి సీఎం రంగంలోకి దిగడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్టాల్ వద్దకు వస్తే.. ఆయనకు ఇష్టమైన వంటలన్నీ వండి పెడతానని చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. తన ఫుడ్ స్టాల్ తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
హైదరాబాద్ లో రోడ్డు పక్కన భోజనం స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ.. తాజా వివాదం వల్ల ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది. అయితే దీని కన్నా ముందే ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక మంది వీడియోలు చేశారు. రుచికరమైన భోజనాలు అందుబాటు రేట్లకు అందించడంతో సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్ ఆమె వీడియోలను వైరల్ చేశారు. దాంతో ఆమె పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది. అందబాటు ధరలోనే రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తుండటంతో.. ఆమె ఫుడ్ స్టాల్‌కు జనాలు క్యూ కట్టారు.
రోజూ వందల సంఖ్యలో జనాలు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు రావడంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో రద్దీ పెరిగి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెపై కేసు నమోదు చేయడం మాత్రమే కాక ఫుడ్ స్టాల్‌ను మూయించారు. ఇది కాస్త పెను వివాదంగా మారింది. అయితే పోలీసులు తనతో దుసురుసుగా ప్రవర్తించారని, తన కొడుకుపై చేయి చేసుకున్నారని ఆరోపించింది కుమారి ఆంటీ. తనకున్న జీవనాధారాన్ని దూరం చేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ ఈవార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఈవివాదంపై ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. కుమారి ఆంటీ స్టాల్ ను అక్కడే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు సీఎం. త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తాను అని కూడా తెలిపారు సీఎం. ఏకంగా సీఎం స్పందించడంతో కుమారి అంటి ఆనందం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి తమ స్టాల్ వద్దకు వస్తే.. ఆయనకు ఇష్టమైనవన్నీ వండి పెడతానని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది.