Nidhan
సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీ ఒకప్పుడు సింగర్ హేమచంద్ర ఇంట్లో పనిచేశారని చాలా మందికి తెలియదు. అసలు ఆ స్థాయి నుంచి సీఎం గుర్తించే రేంజ్‌కు ఆమె ఎలా చేరుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీ ఒకప్పుడు సింగర్ హేమచంద్ర ఇంట్లో పనిచేశారని చాలా మందికి తెలియదు. అసలు ఆ స్థాయి నుంచి సీఎం గుర్తించే రేంజ్‌కు ఆమె ఎలా చేరుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
లైఫ్‌లో పైకి రావాలంటే హార్డ్ వర్క్ ఉండాలి. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు ఎదురుండదని పెద్దలు కూడా అంటుంటారు. నిరంతరం కష్టపడుతూ తమను తాము మెరుగుపర్చుకున్న వారు పక్కాగా ఎదుగుతారని చెబుతుంటారు. దీనికి మరో ఎగ్జాంపుల్‌గా కుమారి ఆంటీ అని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. నెట్టింట మొత్తం ఈ పదం చుట్టూనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఫుడ్ వీ లవింగ్ బాగా పెరిగిపోయింది. ఫుడ్ అంటే ఇష్టం ఉన్న కొంతమంది భోజనం మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా తిరుగుతూ అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా ఫేమస్ అయిన మహిళే కుమారి ఆంటీ. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తించే రేంజ్‌కు ఆమె ఎదిగారు. అయితే ఒకప్పుడు సింగర్ హేమచంద్ర ఇంట్లో ఆమె వంటమనిషిగా పనిచేశారు.
కుమారి ఆంటీ పూర్తి పేరు సాయి కుమారి. ఆమెకు సోషల్ మీడియా కుమారి ఆంటీగా పేరు పెట్టింది. గత రెండు, మూడేళ్లుగా ఆమె వీడియోలు నెట్టింట తిరుగుతూనే ఉన్నాయి. అయితే మీ బిల్ రూ.1,000 అయింది రెండు లివర్స్ ఎక్స్ట్రా అనే వీడియో బాగా వైరల్ అయింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో వీడియోలు, మీమ్స్ తెగ హల్చల్ చేశాయి. ఈ టైమ్‌లో ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ యూనిట్ ఆమె ట్రెండింగ్‌లో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ అక్కడికి వెళ్లడంతో మీడియా ఫోకస్ కుమారి ఆంటీపై పడింది. దీంతో యూట్యూబ్ ఛానల్స్‌తో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నాలు చేశాయి. ఆ తర్వాత పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్‌ను అడ్డుకోవడంతో ఈ వ్యవహారం కాస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్లింది. ఆయన త్వరలో ఆమె ట్రక్‌ను విజిట్ చేసి అక్కడ భోజనం కూడా చేస్తానన్నారు. దీంతో అసలు ఆమె ఎవరనే విషయం మీద చర్చ జరుగుతోంది.
కుమారి ఆంటీగా పాపులర్ అయిన దాసరి సాయి కుమారి సొంతూరు గుడివాడ. అయితే మెరుగైన జీవితం కోసం భర్తతో కలసి కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చింది. దాదాపు 13 ఏళ్ల నుంచి ఆమె ఫుడ్ బిజినెస్‌లోనే ఉంది. మార్నింగ్ లేచి వెజ్, నాన్ వెజ్ వంటలు రెడీ చేసుకొని బిజినెస్ట్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ వ్యాపారంలోకి రావడానికి ముందు ప్రముఖ సింగర్ హేమచంద్ర ఇంట్లో ఆమె వంట మనిషిగా పనిచేసేది. కానీ పిల్లలు పెరుగుతుండటం, ఖర్చులు ఎక్కువవుతుండటంతో ఈ బిజినెస్‌లోకి దిగానని సాయి కుమారి వెల్లడించింది. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వల్ల తనకు పాపులారిటీ లభించిందని.. కానీ అదే టైమ్‌లో నష్టం కూడా జరిగేలా అనిపిస్తోందని వాపోయింది. నిన్న రూ.50 వేల ఫుడ్ అమ్ముకునే ఛాన్స్ లేకుండా పోలీసులు సీజ్ చేశారని పేర్కొంది. అయితే మొత్తానికి సీఎం రేవంత్ ఆమెను కలుస్తానని చెప్పడం, భోజనం కూడా రుచి చూస్తానని అనడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఒకప్పుడు సింగర్ ఇంట్లో వంటమనిషిగా ఉన్న ఆమె ఈ రోజు ముఖ్యమంత్రి గుర్తించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. మరి.. కుమారి ఆంటీ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.