iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రోటోకాల్‌ పక్కకు పెట్టి.. రెస్టారెంట్లో సామాన్యుడిలా సందడి చేసిన కేటీఆర్‌

  • Published Nov 18, 2023 | 1:29 PM Updated Updated Nov 18, 2023 | 1:29 PM

మంత్రులు, మినిస్టర్లు బయటకు వెళ్లాలంటే ప్రోటోకాల్‌ తప్పని సరిగా ఫాలో అవుతారు. కానీ తాజాగా కేటీఆర్‌ మాత్రం ప్రోటోకాల్‌ని పక్కకు పెట్టి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి సామాన్యుడిలా సందడి చేశారు.

మంత్రులు, మినిస్టర్లు బయటకు వెళ్లాలంటే ప్రోటోకాల్‌ తప్పని సరిగా ఫాలో అవుతారు. కానీ తాజాగా కేటీఆర్‌ మాత్రం ప్రోటోకాల్‌ని పక్కకు పెట్టి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి సామాన్యుడిలా సందడి చేశారు.

  • Published Nov 18, 2023 | 1:29 PMUpdated Nov 18, 2023 | 1:29 PM
వీడియో: ప్రోటోకాల్‌ పక్కకు పెట్టి.. రెస్టారెంట్లో సామాన్యుడిలా సందడి చేసిన కేటీఆర్‌

సాధారణంగా సినిమా, రాజకీయ నాయకులు బయటకు వస్తే.. వారి చుట్టూ సెక్యూరిటీ గార్డులు ఉంటారు. జనాలు మీద పడకుండా చూసుకుంటారు. ఇక మినిస్టర్లు, మంత్రులు బయటకు వస్తే.. వారు కచ్చితంగా ప్రోటోకాల్‌ ఫాలో అవుతారు. చుట్టూ సెక్యూరిటీ లేకుండా ఎక్కడకు వెళ్లరు. కానీ ఇందుకు భిన్నంగా ఎలాంటి హడావుడి లేకుండా.. ప్రోటోకాల్‌ పక్కకు పెట్టి మరి.. ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రెస్టారెంట్‌ లోపలకు వెళ్లేంత వరకు ఎవరూ ఆయనను గుర్తు పట్టలేదు. చివరకు ఆర్డర్‌ ఇవ్వడానికి వెళ్లినప్పుడు అక్కడ మంత్రిని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. ఆయన చుట్టూ మూగి తమ సంతోష్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంభంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఉన్న ఓ రెస్టారెంట్‌కి సామాన్యుడిలా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు మంత్రి కేటీఆర్‌. శుక్రవారం రాత్రి రెస్టారెంట్‌లో సందడి చేశారు కేటీఆర్‌. ప్రోటోకాల్‌ లేకుండా రెస్టారెంట్‌కి వచ్చిన మంత్రి కేటీఆర్‌ని చూసి అక్కడకు వచ్చిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ముందు ఆయనను ఎవరు గుర్తించలేదు. కాని ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు. కేటీఆర్‌ వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది. కాని అందుకు భిన్నంగా కేసీఆర్‌ ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్‌ ఇవ్వడం చూసి రెస్టారెంట్‌లో ఉన్న వారు విస్తుపోయారు.

మంత్రి కేటీఆర్‌ వచ్చారని తెలుసుకున్న రెస్టారెంట్‌ యాజమాన్యం.. ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు. ఈ రెస్టారెంట్‌లో కేటీఆర్‌ బిర్యానీతో పాటు.. పలురకాల దేశ, విదేశ వంటకాలను రుచి చూశారు. ఆయన ఇటు డిన్నర్‌ చేస్తూనే.. అక్కడకు వచ్చిన కస్టమర్లను పలకరించారు. వారి మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌ రెస్టారెంట్‌కి వచ్చిన వార్త నిమిషాల్లో వైరల్‌ అయ్యింది. దాంతో చాలా మంది జనాలు అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్‌తో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş