Dharani
KTR-Free Bus Journey Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిక్కుమాలిన పథకమంటూ విమర్శలు చేశారు. ఆవివరాలు..
KTR-Free Bus Journey Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిక్కుమాలిన పథకమంటూ విమర్శలు చేశారు. ఆవివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ప్రకటించినట్లుగానే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. రేంవత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఫైల్ మీదనే సంతకం చేశారు. డిసెంబర్ 9, 2023 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద.. వయసుతో సంబంధం లేకుండా తెలంగాణలోని మహిళలందరూ రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం అమలవుతుంది. దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించడమే కాక.. ఈ పథకంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.
అయితే ఆటో డ్రైవర్లు, క్యాబ్, ర్యాపిడో సర్వీస్‌ల వారు మాత్రం.. మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై వ్యతిరేకించారు.. ఆందోళనలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వారితో మాట్లాడి.. వారిని ఆదుకునే చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కేటీఆర్.. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై విమర్శలు చేశారు. ఇదో దిక్కుమాలిన పథకమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఒక పథకం ప్రవేశపెట్టే ముందు.. అన్నీ సరిగ్గా ఉన్నాయా, లేదా చూసుకొని తీసుకురావాలి తప్ప.. ఏదో చేసినమా అంటే చేసినం అన్నట్లు ఉండకూడదని.. జనాలను ఆగమాగం చేయకూడదని ఆయన సూచించారు. శనివారం (జనవరి 27) హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు. దీని వల్ల బస్సుల్లో ఆడబిడ్డలు ఎలా కొట్లాడుకుంటున్నారో నాకన్నా బాగా మీకే తెలుసు. బస్సులో చోటు కోసం ఆడాళ్లు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటుర్రు. బస్సు ఎక్కడానికే.. డ్రైవర్ సీట్లలో నుంచి, కిటీకీల నుంచి పోతున్నరు. దిక్కుమాలిన ఫ్రీ బస్సు పథకం వల్ల మహిళలు ఒకరినొకరు చెప్పులు తీసుకొని, జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది’’ అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు.
అంతేకాక ఫ్రీ బస్సు పథకం ఉద్దేశం మంచిదేనని, తాను కాదనడం లేదన్నారు. అయితే బస్సుల సంఖ్య పెంచాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ పథకం వల్ల ఇటు మగవాళ్లేమో.. డబ్బులు పెట్టి టికెట్ కొంటే వారికి సీట్లు లేవని బాధపడుతున్నారన్నారు. ఆడబిడ్డలేమో.. బస్సులు తక్కువయ్యాయి, మేం కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆగమైతుండ్రు అన్నారు. అటు ఆటో డ్రైవర్లేమో.. ప్రభుత్వం ఈ పథకం తెచ్చి పెట్టి మా పొట్టమీద కొట్టిందని బాధపడుతుండ్రు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండ్రు అని చెప్పుకొచ్చారు కేటీఆర్. అన్నీ సరిగా చూసుకుని పథకాలు తీసుకురావాలని.. బిల్డప్ కోసం స్కీమ్‌లు ప్రవేశపెడితే ఇలానే ఉంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.