iDreamPost
android-app
ios-app

KTR న్యూ లుక్.. స్టార్ హీరోలను మించి ఉందిగా..!

కేటీఆర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా హీరో లెవెల్లో ఉన్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది. జుట్టు, గడ్డం పెంచుకుని కొత్త లుక్‌లో స్టార్ హీరోలా కనిపిస్తున్నారు.

కేటీఆర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా హీరో లెవెల్లో ఉన్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది. జుట్టు, గడ్డం పెంచుకుని కొత్త లుక్‌లో స్టార్ హీరోలా కనిపిస్తున్నారు.

KTR న్యూ లుక్.. స్టార్ హీరోలను మించి ఉందిగా..!

తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు కేటీఆర్. ఐటీ మినిస్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఐటీ మినిస్టర్ అంటే ఇలా ఉండాలని అనుకునేలా ఐటీరంగంపై, దేశ యువతపై తనదైన ముద్ర వేశారు ఈ యువనాయకుడు. అనర్గళమైన స్పీచులతో తనకు తానే సాటిగా నిలిచారు కేటీఆర్. హైదరాబాద్ కు ఐటీ కంపెనీలను ఆహ్వానించి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా కృషి చేశారు. ఇదిలా ఉంటే కేటీఆర్ కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా హీరో లెవెల్లో ఉన్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది.

తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కల్లకుంట్ల తారక రామా రావు కొత్త లుక్ లో అదరగొడుతున్నారు. ఎప్పుడూ కూడా చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చే కేటీఆర్ ఇది వరకు ఎప్పుడూ కూడా చూడని లుక్ లో కనిపించారు. ఈ కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోను స్వయంగా కేటీఆర్ తన వ్యక్తిగత ఖాతా ఎక్స్ లో నెటిజన్స్ తో పంచుకున్నారు. అయితే ఆ పిక్ ఒరిజినల్ అనుకుంటే మాత్రం పొరపాటే. అది కేటీఆర్ వీరాభిమాని ఉడిట్ చేసిన పిక్. కానీ ఆ పిక్ చూస్తుంటే మాత్రం స్టార్ హీరోలకు మించి ఉండడంతో కేటీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు గ్రేట్ లుకింగ్, లుకింగ్ లైక్ అర్జున్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెయిర్ స్టయిల్‌ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్‌లో దర్శనమిచ్చారు. జుట్టు, గడ్డం పెంచుకుని కొత్త లుక్‌లో స్టార్ హీరోలా కనిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని కేటీఆర్‌ ఫొటోను పొడవాటి జుట్టు, గడ్డంతో ఎడిట్‌ చేసి ఆయనకే పంపించాడట. ఆ ఫొటో బాగా నచ్చడంతో.. ‘బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా ఆరాదించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్‌ చేస్తున్నా’ అనే క్యాప్షన్‌ ఇస్తూ కేటీఆర్‌ ఆ ఫొటోను పోస్ట్ చేశారు.

ఒక వేళ నేను నా జుట్టు, గడ్డం పెంచితే ఇలా ఉంటుందని దానికి స్మైలీ ఎమోజీని ఆడ్ చేసి షేర్ చేశారు. కాగా, అభిమాని ఎడిట్‌ చేసిన పంపిన ఫొటోలో ‘కేటీఆర్‌’ అని ఇంగ్లిష్‌లో పెద్ద అక్షరాలతో రాశారు. పేరు కింద ‘ది కమ్‌ బ్యాక్‌ ఈజ్‌ ఆల్వేస్‌ స్ట్రాంగర్‌ దెన్‌ ది సెట్‌ బ్యాక్‌’ అనే కొటేషన్‌ను జతచేశారు. ఫొటో పైభాగంలో ఎడమ పక్కన పింక్ యాంట్స్ టీమ్ యూఎస్ఏ అని ఉంది. మరి కేటీఆర్ న్యూ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap