Arjun Suravaram
ఆర్మూర్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మూర్ ర్యాలీలో మంత్రి కేటీఆర్ కి ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలు దేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్మూర్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మూర్ ర్యాలీలో మంత్రి కేటీఆర్ కి ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలు దేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
తెలంగాణ ఎన్నికల్లో మంచి రసవత్తరంగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మూర్ ర్యాలీలో మంత్రి కేటీఆర్ కి ప్రమాదం జరిగింది. ఆర్మూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలు దేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. నామినేషన్ వాహనం నుంచి కేటీఆర్ ముందుకు పడ్డారు. వాహనంపై నుంచి బీఆర్ఎస్ నేతలు సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలు నేలపై పడ్డారు. కేటీఆర్ పడిపోకుండా ఆయన గన్ మెన్ పట్టుకున్నారు. వాహనం కి ముందు ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీగా వెళ్తూ.. నామినేషన్లు సమర్పిస్తున్నారు. పలు చోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కీలక నేతలు హాజరవుతున్నారు. అలానే ఆర్మూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కేటీఆర్ ప్రయాణిస్తున్న ప్రచార వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వాహనానికి ఉన్న రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో రెయిలింగ్ ను ఆనుకుని ఉన్న కేటీఆర్ జారిపడ్డారు. అలానే కేటీఆర్ కు ఇరువైపుల ఉన్న జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి కూడా వాహనంపై నుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి పూర్తిగా వాహనం నుంచి కిండపడిపోయారు. కేటీఆర్ ను పడకుండా గన్ మెన్ పట్టుకున్నారు. అయితే తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కేటీఆర్ తెలిపారు.
ఆర్మూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలు దేరారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవన్‌రెడ్డి.. మూడోసారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి కేటీఆర్ ఆర్మూర్‌కు చేరుకొని ఆలూర్ బైపాస్ రోడ్డులో ప్రసంగించారు. ఈ సందర్భంగా సుమారు 50వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇలా ఉత్సాహంగా జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీ జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.