iDreamPost
android-app
ios-app

మొగులయ్య కూలీగా మారడంపై..KTR కీలక వ్యాఖ్యలు!

ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. న జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు.  పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన తాజాగా కూలీగా మారాడు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. న జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు.  పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన తాజాగా కూలీగా మారాడు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

మొగులయ్య కూలీగా మారడంపై..KTR కీలక వ్యాఖ్యలు!

ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జీవనోపాధి కోసం జానపద పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగి..తన గాత్రంతో అందరిని అలరించే వాడు. ఆ తరువాత సినిమాలో అవకాశం లభించి.. పాట కూడా పాడారు. అలానే పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. ఏమైందో తెలియదు కూలీగా మారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన రోజూ వారికీ కూలీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొగులయ్య ఇష్యూపై  మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మరి.. కేటీఆర్ ఏమన్నారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు దర్శనం మొగులయ్య పెద్దల నేర్పిన కిన్నెర వాయిద్యాంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన జానపద పాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.  ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో తన గాత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నరు మొగులయ్య. గతంలో పాన్ గల్, మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయించి పాడేవారు. ఇక ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.

అయితే తాజాగా మండుటెండల్లో రోజువారీ కూలీగా మారి దుర్భరమైన పరిస్థితులలో ఆయన పని చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్ లో ఓ నిర్మాణ స్థలంలో ఆయన పని చేస్తూ కనిపించారు. తాను కూలీగా మారడంపై మొగులయ్య స్పందించారు. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే పొట్టకూటి కోసం కూలీపనులకు వెళ్తునట్లు ఆయన తెలిపారు. తన కుమారుల్లో ఒకరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని, ఇక తన ఆరోగ్య పరిస్థితి అంతత మాత్రమే ఉందని ఇలాటి సమయంలో మందుల కోసం నెలకు కనీసం రూ. 7,000 కావాలని తెలిపారు. అలాగే కుటుంబం నా మీదనే ఆధారపడి ఉండటంతో.. తాను కూలీ పనులకు వెళ్తున్నానని మొగులయ్య తెలిపారు.

ఇక గత ప్రభుత్వం మంజూర్ చేసిన రూ. 10 వేల నెలవారీ గౌరవ వేతనం ఇటీవలే నిలిపివేశారని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. దీంతో ఇంట్లో పూట గడవటం కోసం తాను పని కోస చాలా చోట్లు ప్రయత్నించానని అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలను మొగులయ్యను కలిశారని, త్వరలోనే  సమస్యలను తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వ నిర్ణయం కోసం తాను వేచి చూస్తున్నానని మొగులయ్య వెల్లడించారు.

ఇదే సమయంలో కిన్నెర మొగులయ్య రోజువారీ కూలీగా మారడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మొగులయ్యకు తాను అండగ నిలుస్తానిని ట్వీట్ చేశారు.”ఆయన కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా ఆదుకుంటా. నా ఆఫీస్ సిబ్బంది వెంటనే మొగులయ్య వద్దకు వెళ్లారు” అని కేటీఆర్ తెలిపారు. మరి…మొగులయ్య విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి