iDreamPost
android-app
ios-app

అమ్మ నన్ను డాక్టర్‌ చేయాలనుకుంది.. కానీ నా ఎంసెట్‌ ర్యాంక్‌కి: KTR

  • Published Sep 16, 2023 | 11:21 AM Updated Updated Sep 16, 2023 | 11:21 AM
  • Published Sep 16, 2023 | 11:21 AMUpdated Sep 16, 2023 | 11:21 AM
అమ్మ నన్ను డాక్టర్‌ చేయాలనుకుంది.. కానీ నా ఎంసెట్‌ ర్యాంక్‌కి: KTR

తెలంగాణలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న రాజకీయ నాయకులలో​.. కేటీఆర్‌ ముందు వరసలో ఉంటారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్‌.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా ప్రత్యర్థుల మీద విరుచుకుపడటంలో.. విమర్శలు చేయడంలో కేటీఆర్‌కు ఎవరూ సాటి రారు. పొలిటికల్‌ పరంగానే కాక.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ట్విట్టర్‌లో కేటీఆర్‌కు విపరీతమై ఫాలోయింగ్‌ ఉంది. సమస్య అని చెబితే చాలు.. వెంటనే స్పందించి.. సాయం చేస్తారు. సమస్యను పరిష్కరిస్తారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో 9 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిరిసిల్లలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్‌ కాలేజీ ప్రారంభించిన తర్వాత.. సెస్ ఆఫీసు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ తాను చదువుకునే రోజులు గుర్తు చేసుకుని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . తాను కూడా 1993లో ఇంటర్ బైపీసీ పూర్తిచేసినట్లు చెప్పుకొచ్చారు కేటీఆర్. అంతేకాక తల్లి తనను డాక్టర్‌ చేయాలనుకుందని.. కానీ.. నాన్న (కేసీఆర్) మాత్రం తనను ఐపీఎస్‌ ఆఫీసర్‌‌లా చూడాలనుకున్నారని చెప్పుకొచ్చారు.

అమ్మ కోరిక మేరకు తాను ఎంసెట్ కూడా రాశానని.. అందులో 1600 ర్యాంక్‌ వచ్చిందని గుర్తు చేసుకున్నారు కేటీఆర్‌. అయినప్పటికీ.. తనకు మెడికల్‌ సీటు మాత్రం రాలేదని తెలిపారు. కానీ.. ఇప్పుడున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులని.. తెలంగాణాలో 10000 మంది వైద్యులు ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల నుంచి బయటకు వస్తున్నట్టు చెప్పుకొచ్చారు కేటీఆర్‌.