iDreamPost
android-app
ios-app

థియేటర్ ల దోపిడీపై కోమటిరెడ్డి సంచనల కామెంట్స్!

  • Published Mar 29, 2024 | 4:37 PM Updated Updated Mar 29, 2024 | 4:37 PM

Komatireddy Comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Komatireddy Comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

థియేటర్ ల దోపిడీపై కోమటిరెడ్డి సంచనల కామెంట్స్!

ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమా థియేటర్లు, మాల్స్ లో స్నాక్స్, డ్రింక్స్ పై ఇష్టానుసారంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా.. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెద్ద సినిమాలు, థియేటర్ల దోపీడీపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో థియేటర్ల దోపిడీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సినిమా థియేటర్లలో స్నాక్స్ రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శాఖ వారికి థియేటర్లకు వెళ్లి టికెట్, స్నాక్స్ కొని బిల్లులు తెమ్మని చెప్పినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఆ బిల్లులు రాగానే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి టికెట్ రేటు పెంచుతామంటే ఎలా అని అన్నారు. పెద్ద సినిమాలు వచ్చినపుడు చిన్న సినిమాలకు ధియేటర్ల సమస్యలు వస్తున్నాయి.. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించారు.

ఇకపై చిన్న సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ తప్పకుండా నెరవేరుస్తుంది. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారు. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు.. గత ప్రభుత్వం ఎంతగా దోపిడీ చేసిందో తెలిసిపోయింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.