Arjun Suravaram
komati Reddy Venkat Reddy Biography & Political Journey: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కోమరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఓ సాధారణ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన ఆయన రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శం. తాజాగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
komati Reddy Venkat Reddy Biography & Political Journey: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కోమరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఓ సాధారణ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన ఆయన రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శం. తాజాగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Arjun Suravaram
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగిరింది. అలానే నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మంత్రులుగా కొందరు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, నల్లొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటి రెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పని చేసిన ఆయన.. తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరి.. ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన కోమటి రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. ఉమ్మడి నల్లొండ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి 1963 మే 23న నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెమల గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పాపిరెడ్డి వ్యవసాయం చేసేవారు. పాపిరెడ్డికి 9 మంది సంతానం కాగా.. వెంకటరెడ్డి 8వ వాడు. హైదరాబాద్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఉన్నత విద్యాను పూర్తి చేశారు. అనంతరం సీబీఐటీ కాలేజీ నుంచి 1986లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ను పూర్తి చేశారు. ఆయన కాలేజీ రోజుల్లో నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు.
1986లో జిల్లా ఎన్ఎస్ యూఐ ఇంఛార్జీగా పని చేశాడు. ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగి.. నేడు రాష్ట్ర స్థాయిలో కీలక నేతల్లో ఒకరిగా మారారు. ఇంకా చెప్పాలంటే ఒక్కానొక్క దశలో సీఎం అభ్యర్థి రేసులో కోమటి రెడ్డి కూడా ఉన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 1999,2004,2009,2014 వరుసగా నాలుగుసార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో వెంకటరెడ్డి ఓడారు.
అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. నల్గొండ నియోజకవర్గ చరిత్రలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డే. నల్గొండ జిల్లాపై కోమటి రెడ్డ బ్రదర్స్ మంచి పట్టు ఉంది. ఆ జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాలపై కోమటి రెడ్డి బ్రదర్స్ గట్టి పట్టుంది. వారి అండతో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండే వారు. ఆయన అంటే వెంకట రెడ్డికి ఎనలేని అభిమానం కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తొలిసారి మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తొలిసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలను పర్యవేక్షించారు. ఇక 2009లో రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ముఖ్యమంత్రులు మారారు.
ఆ తర్వాత వచ్చిన రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ వెంకట్ రెడ్డి పని చేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 2011లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసి.. పోరాడిన నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి. ఇక తెలంగాణ ఉద్యోమంలో భాగంగా భాగంగా కోమటిరెడ్డి 2011 అక్టోబర్ లో శాసనసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాజీనామాలను అంగీకరించలేదు.
వెంకటరెడ్డికి ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో కోమటి రెడ్డి తీవ్రవేదనకు గురయ్యారు. కుమారుడు ప్రతీక్ జ్ఞాపకార్థం వెంకట్ రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నల్గొండలో రూ.3.5 కోట్లతో పలు కాలేజీలు నిర్మించారు. ప్రతి ఏటా ఈ ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
2009 రాజశేఖర్ రెడ్డి మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెనుమార్పులు జరిగాయి. కాంగ్రెస్ దారుణమైన స్థితికి వెళ్లిపోయింది. 2014, 2018లో తెలంగాణలో కాంగ్రెస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ సమయంలో ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వదలి బీఆర్ఎస్ లో చేరారు. అయితే కోమటి రెడ్డి మాత్రం తనకు రాజకీయ జీవితం కల్పించిన కాంగ్రెస్ ను వదల్లేదు. ఎంతమంది ప్రలోభాలకు గురి చేసిన కూడా వెంకట్ రెడ్డి లొంగలేదు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచారు. అలా దాదాపు పదేళ్ల కాలం పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. పార్టీపై ఆయనకు ఉన్న విధేయత, విశ్వసనీయత కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మరోసారి మంత్రి అయ్యారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి నమ్మన వ్యక్తి, కాంగ్రెస్ నే నమ్ముకున్న వ్యక్తి కోమటిరెడ్డి. నల్గొండ జిల్లా అంటే కోమటి రెడ్డి.. కోమటి రెడ్డి అంటే నల్గొండ జిల్లా అనే అంతలా జిల్లాపై తన ముద్ర వేశారు. మరి.. ఓ విద్యార్థి సంఘ నాయకుడి నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీవిత, రాజకీయ ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.