P Krishna
తెలంగాణలో కిన్నెర వాయిద్యంతో ఎంతోమంది హృదయాలను గెల్చుకున్న కళాకారుడు దర్శనం మొగిలయ్య. బీమ్లా నాయక్ లో టైటిల్ సాంగ్ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది.
తెలంగాణలో కిన్నెర వాయిద్యంతో ఎంతోమంది హృదయాలను గెల్చుకున్న కళాకారుడు దర్శనం మొగిలయ్య. బీమ్లా నాయక్ లో టైటిల్ సాంగ్ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చింది.
P Krishna
ఎక్కడో మారుమూల పల్లెల్లో కిన్నెరవాయిస్తూ పాటలు పాడుకునే మొగిలయ్య ఒకే ఒక్క పాటతో తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ మూవీలో టైటిల్ సాంగ్ విడుదల తర్వాత మొగిలయ్య పాట, కిన్నెర వాయిద్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దర్శనం మొగిలయ్య వంశపారంపర్యంగా కిన్నెర వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఆయన తన ముందు తరాల పేర్లు చెప్పి ఈ వాయిద్యం ఎక్కడ నుంచి మొదలయ్యిందో వివరిస్తుంటారు. తన పూర్వికులు శృతి కట్టిన పాటలే తాను పాడుతుంటానని చెబుతుంటారు. తాజాగా దర్శనం మొగిలయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే..
దర్శనం మొగిలయ్య ఈ పేరు తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఒకప్పుడు ఆయన తెలుగు రాష్ట్ర ప్రజలకు పెద్దగా పరిచయం లేకున్నా. పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ లో ‘ఆడాలేడు మీయాసాబ్ ఈడాలేడు మియాసాబ్’ టైటిల్ సాంగ్ తో బాగా పాపులర్ అయ్యారు. మహబూబ్ నగర్ ప్రాంతంలో పేదల కోసం పోరాడిన వ్యక్తి మియాసాబ్.. ఆయనపై రాసిన పాటతో బాగా పాపులర్ అయ్యారు మొగిలయ్య. వాస్తవానికి తెలంగాణ రాక ముందు ఆయనకు పెద్దగా గుర్తింపు లేదు. సంతల్లో ఈ వాయిద్యం వాయిస్తూ పొట్టపోసుకునే వారు. బీమ్లా నాయక్ లో పాట పాడిన తర్వాత ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలతో ఊదరగొట్టాయి. అంతేకాదు కిన్నెర కళను బతికిస్తున్నందకు ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
దర్శనం మొగిలయ్య మళ్లీ వార్తల్లో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు మొగిలయ్య. ఈ సందర్బంగా తన కిన్నెర కళను ఆయన ముందు ప్రదర్శించారు. ‘పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన.. అచ్చంపేట తాలుకాలోన కొండారెడ్డి పల్లిలోన’ అంటూ పాట పాడారు. ఈ పాట విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చాలా ఎమోషన్ అయ్యారు. ఆయనను దగ్గరకు తీసుకొని అభినందించారు. ఈ సందర్బంగా మొగిలయ్య తన వ్యక్తిగత విషయాల గురించి సీఎం తో చర్చించినట్లు తెలుస్తుంది. మొగిలయ్య పాట పాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి పక్కన మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Listen to Kinnera Mogulaiah sing for CM Revanth Reddy pic.twitter.com/7bNOevTbvW
— Naveena (@TheNaveena) April 3, 2024