iDreamPost
android-app
ios-app

లోక్ సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

ప్రస్తుతం తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మే  13న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

ప్రస్తుతం తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మే  13న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

లోక్ సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం మంచి రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వానేనా అన్నట్లు  ఎన్నికల ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ మోజార్టీ స్థానాల్లో గెల్చేందుకు వ్యూహాలు రచిస్తుంటే.. ఇదే సమంయలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించాలనే ఆలోచనలో ఉంది. అలానే నేటితో తెలంగాణలో నామినేషన్ ల ప్రక్రియ పూర్తైంది. 17 స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.  ఇక లోక్ సభ ఎన్నికల హడావుడి ఉండగానే తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మే 13న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా జూన్ 4వ తేదీన ఫలితాలు విడుద కానున్నాయి. మొత్తంగా ఇలా లోక్ సభ ఎలక్షన్ హంగామా జరుగుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం,వరంగల్,నల్గొండ నియోజకవర్గ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎన్నిక సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక్కడి నుంచి గతంలో బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మే 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. అలానే మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. చివరగా మే 13న ఉపసంహరణకు చివరి తేదీ అని ఈసీ పేర్కొంది. మే 27వ ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మే 27 తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలానే లోక్ సభ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే  జూన్‌ 5న కౌంటింగ్‌ జరుగుతుందని ఈసీ వెల్లడించింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వివరాలు:

  • మే 2వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల.
  • మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
  • మే13న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ.
  • మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.
  • జూన్‌ 5న ఫలితాల విడుదల