P Krishna
Hyderabad News: ఎండలు మండిపోతున్నాయి.. బయటికి రావలంటే భయంతో వణికిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎండకాలం అంటే నీటి కష్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
Hyderabad News: ఎండలు మండిపోతున్నాయి.. బయటికి రావలంటే భయంతో వణికిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎండకాలం అంటే నీటి కష్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
P Krishna
ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొద్దిసేపు సేద తీరుతున్నారు. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక జనాలు శీతల పానియాల వెంట పడుతున్నారు. సాధారణంగా వేసవి కాలంలో భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల నీటి ఎద్దడి ఉంటుంది. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటారు. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో నీటి కష్టాలు లేకుండా ట్యాంకర్ మేనేజ్ మెంట్ పై ఎండీ సుదర్శన్ రెడ్డి జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ సమయం తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఎవరికి కూడా నీటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధమైనంత వరకు డెలివరీ త్వరగా చేయాలని అన్నారు. తొందర్లోనే ట్యాంకర్ డెలివరీ టైమ్ 12 గంటలకు తగ్గించాలని సూచించారు. అందుకోసం అన్ని రకాల చర్యలు చేపట్టానని అధికారులకు కోరారు. జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నగరంలో సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్ లలో 24 గంటల్లోపే ట్యాంకర్లు డెలివరీ చేస్తున్నాయని.. ఇకపై ఆ సమయాన్ని తగ్గించేందుక అన్ని రకాలుగా కృషి చేస్తామని ఎండీ సుదర్శన్ రెడ్డి అన్నారు.
రాబోయే రెండు నెలలకు నగర వాసులకు ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రచించాలని అన్నారు. గత నెల మార్చితో పోలిస్తే.. కొత్త ట్యాంకర్లు, ట్రిప్పులు, డెలివరీలు, ఫిల్లింగ్ స్టేషన్లు అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో సాధ్యమైనంత వరకు పెండింగ్ తగ్గించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీటి సరఫరా విషయంలో ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా ఆటంకాలు కలిగించినా.. ట్యాంకర్ల మల్లించాలనే ప్రయత్నాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవి దృష్టిలో పెట్టుకొని ఎంసీసీకి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.