కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అరెస్టుపై స్పందించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అరెస్టుపై స్పందించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లి లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. గత నెలలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు కవిత ఇంటిపై సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం తీహార్ జైళ్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. కాగా కూతురు అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి స్పందించారు. కవిత అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని అన్నారు. కక్షపూరిత ధోరణితో ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారన్నారు.

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేసిందని తెలిపారు. బీఎల్ సంతోష్ ను రంగంలోకి దింపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపాం. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని తెలిపారు. ఈ కక్షతోనే కవితను మ‌నీలాండ‌రింగ్ కేసులో ఇరికించార‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. సంతోష్ పై కేసు పెట్టకపోయుంటే కవిత అరెస్టు ఉండేది కాదని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అంతా ఉత్తదే అని కేసీఆర్ వెల్లడించారు. కవిత తప్పు చేసినట్లు ఆధారాలు చూపెట్టలేరని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్ర పరిస్థితిపై మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో మిల్లర్లు లేరని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని కేసీఆర్ చెప్పారు. అందరు కలిసి కట్టుగా పనిచేస్తే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు వ‌స్తాయని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 8 లోక్‌స‌భ సీట్ల‌లో గెలుస్తామ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేత‌లు పార్టీని ఎందుకు విడిచి వెళ్లామా అని బాధ‌ప‌డుతున్నారని కేసీఆర్ తెలిపారు.

Show comments