బ్రేకింగ్: KCR కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎనిమిది వాహనాలు ధ్వంసం

కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి.

కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి.

కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కి ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లో వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 8 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాన్వాయ్ లోని కారు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాల బానెట్ భాగం చాలా డ్యామేజ్ అయ్యింది. మితిమీరిన వేగంతో వెళ్తుండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. రోడ్ షో, బస్సు యాత్ర ద్వారా ప్రచారాన్ని మొదలుపెట్టారు.

తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి బస్సు యాత్రను మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు భారీ కాన్వాయ్ తో కేసీఆర్ యాత్రను మొదలుపెట్టారు. ఇవాళ్టి నుంచి 17 రోజుల పాటు ఈ యాత్ర కొనాగానుండి. కేసీఆర్ బస్సులో వస్తుండగా.. ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ సెక్యూరిటీకి సంబంధించిన కార్లు కాన్వాయ్ లో వస్తున్నాయి. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాల డ్రైవర్లు కూడా సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్ లో ఉన్న వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 వాహనాలు దెబ్బతిన్నాయి. ఇవాళే కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా కేసీఆర్ ఉదయం పూట 12 లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుంటారు. సాయంత్రం రోడ్ షో ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. అయితే సిద్ధిపేట పర్యటనతో ఈ యాత్ర వచ్చే నెల పదో తేదీన ముగియనుంది.       

గతంలోనూ ప్రమాదం

సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అంటే 2015లో నల్గొండలో కాన్వాయ్ లో వాహనాలు ఢీకొన్నాయి. కేసీఆర్ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వస్తుండగా బీబీనగర్ మండలం కొండమడుగు దగ్గర కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. వేగంగా వెళ్తుండడంతో కాన్వాయ్ లో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. 

Show comments