P Venkatesh
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు.
P Venkatesh
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. తన రాజీనామాకు గల కారణం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని అధిష్టానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేద్దామని కోరినప్పటికీ బాబు వద్దనడంతో తీవ్ర అసంతృప్తి చెంది కాసాని రాజీనామా చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కాసాని వెల్లడించారు.
టీడీపీ పార్టీ వరుస షాక్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ వంటి పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. బాబు హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో బాబును ఎ3గా చేర్చింది. ఇదే సమయంలో టీడీపీకి కాసాని రాజీనామా చేయడం మరో ఎదురు దెబ్బ తగిలినట్లైంది.