Karne Sirisha Alias Barrelakka-Trolling In Social Media: కొత్త జీవితం ప్రారంభించాను.. కానీ ఇప్పుడు చనిపోవాలనిపిస్తుంది: బర్రెలక్క

Barrelakka: కొత్త జీవితం ప్రారంభించాను.. కానీ ఇప్పుడు చనిపోవాలనిపిస్తుంది: బర్రెలక్క

పోలింగ్ కు ఒక్క రోజు ముందు ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడే న్యూ లైఫ్ ప్రారంభించానని.. కానీ చనిపోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే...

పోలింగ్ కు ఒక్క రోజు ముందు ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడే న్యూ లైఫ్ ప్రారంభించానని.. కానీ చనిపోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే...

కర్నె శిరీష అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. బర్రెలక్క అంటే చాలు.. తెలుగు ప్రజలంతా టక్కున గుర్తు పడతారు. సోషల్ మీడియా పుణ్యమా అని బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. ఆ తర్వత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరఫున తన గొంతు వినిపించింది. అసెంబ్లీ బరిలో నిలిచింది. ఆమె చేసిన పని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఎన్నికల్లో నిలవడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సెన్సేషన్ అయ్యింది. ఎంతో మంది మేధావులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత.. కొన్ని రోజుల క్రితమే వివాహం చేసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నన్ను బతకనివ్వడం లేదు.. చనిపోవాలని ఉంది అంటూ కన్నీటి పర్యంత అయ్యింది బర్రెలక్క. ఇంతకు ఏం జరిగిందంటే..

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ వేయటంతో పాటు ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొంది. అందుకు సంబధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో పోలింగ్ కు ఒక్క రోజు ముందు బర్రెలక్క ఇన్‌స్టాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ట్రోలర్స్ తనను హింసిస్తున్నారని ఏడుస్తూ వీడియో చెప్పుకొచ్చింది. తాను ఎంపీగా పోటీ చేస్తున్నందుకు సోషల్ మీడియాలో ట్రోలర్స్ హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారు చేసే కామెంట్స్ చూస్తే ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుందని వాపోయింది. కొన్ని రోజుల క్రితమే తాను పెళ్లి చేసుకొని తన భర్తతో కొత్త జీవితం స్టార్ట్ చేశానని.. కానీ ఈ ట్రోలర్స్ తనను హ్యాపీగా ఉండనివ్వట్లేదని బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేసింది.

ఈవీడియోలో బర్రెలక్క మాట్లాడుతూ.. ’సోసల్ మీడియాలో నా మీద జరుగుతున్న ట్రోలింగ్ చూస్తే.. నేను మరో గీతాంజలి లాగా బలి అవుతానేమో అనిపిస్తుంది. మీ ఆనందం, వ్యూస్, కంటెంట్ కోసం మీరు చేసే వీడియోల వల్ల. నేను నా ఫ్యామిలీ ఈ రోజు బాధపడుతున్నాము. మీ నెగిటివ్ ట్రోలర్స్ నన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఇలా ట్రోల్స్ చేసే వాల్లకు ఇది ఎంటర్‌న్మెంట్ కావొచ్చు. కానీ ఎదుటి వాళ్ల జీవితం. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి. అందులో నాది కూడా ఒకటి. నేనేం తప్పు చేశానో అర్థం కావట్లేదు. కానీ ఇలా ట్రోల్ చేయడం వల్ల నేను, నా ఫ్యామిలీ నేను చాలా బాధపడుతున్నాము. నన్ను విమర్శించే వారిని వదిలి పెట్టను. నన్ను నెగిటివ్‌గా ట్రోల్ చేసిన వారి మీద కంప్లైంట్ చేస్తాను‘ అని వీడియోలో చెప్పుకొచ్చింది.

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నానని.. ఎన్నికల తర్వాత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది బర్రెలక్క. సోషల్ మీడియా వేదికల నుంచి వైదొలగి.. తన భర్తతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాని చెప్పుకొచ్చింది. తాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని… మీ ఎడమ కాలు చెప్పు తీసుకుని కొట్టండి కానీ ట్రోల్స్ చేయకండి అని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Show comments