ఉచితంగా ఆవులు, కోడెలు పొందే అవకాశం.. త్వరగా దరఖాస్తు చేసుకొండి

సామాన్యులకు శుభవార్త.. ఉచితంగా ఆవులు, కోడెలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకొండి. ఆ వివరాలు..

సామాన్యులకు శుభవార్త.. ఉచితంగా ఆవులు, కోడెలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకొండి. ఆ వివరాలు..

సామాన్యులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని కార్యక్రమాల ద్వారా ఆర్థిక సాయం చేస్తే.. కొన్ని జీవనోపాధి అవకాశాలు కల్పించే స్కీమ్‌లు ఉంటాయి. ఇక పేదలను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు, సంచ్ఛంద సంస్థలు మాత్రమే కాక.. ఆలయాలు కూడా ముందుకు వస్తుంటాయి. వాటి వాటి పర్యవేక్షణలో.. ఆలయాల పరిధి మేరకు చేయగలిగినంత సాయం చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా సామాన్యులకు ఓ శుభవార్త చెప్పారు. అది ఏంటంటే..  ఉచితంగా ఆవులు, కోడెలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి మీరు కూడా వీటిని పొందాలంటే.. అప్లై చేసుకొండి. ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఇంతకు ఎవరు దీన్ని చేపట్టారు వంటి వివరాలు మీ కోసం..

వేములవాడ గోశాల నుంచి అదనపు ఆవులు, కోడెల ఉచిత పంపిణీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. ఈమేరకు వేములవాడ ఆలయ గోవుల ఉచిత పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో బుధవారం నాడు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. ‘‘వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి ఏటా ఎందరో భక్తులు మొక్కులో భాగంగా ఆవులు, కోడెలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో గోశాలలో వాటి సంఖ్య బాగా పెరిగింది. అందుకే ఆసక్తి గల అర్హులైన రైతన్నలు, ఆలయ గోశాలలు, ప్రైవేట్ గోశాలలు, హిందూ మతాల వారికి అదనపు కోడెలు, ఆవులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించాము. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.

ఆవులు, కోడెలు పొందేందుకు.. ఆసక్తికల, అర్హులైన రైతులు, ఆలయ గోశాలల నిర్వహించువారు, ప్రైవేట్ గోశాలలు నిర్వహించేవారు హిందూ మతాలకు సంబంధించిన వారి నుంచి దరఖాస్తులు రాకపోయినట్లయితే రైతు సంఘాలు లేదా సొసైటీలకు వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆసక్తికల వారు.. ఆవులు, కోడెలు పొందేందుకు శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఏటా భక్తులు.. వేములవాడ దేవస్థానానికి సుమారు 2,500 కోడెలను సమర్పిస్తున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాజన్న దేవాలయం వద్ద 450-500 వరకు కోడెలు  ఉంచుకొని, మిగిలిన వాటిని వివిధ గోశాలలకు, అర్హులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఉచిత గోవులకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వాన సమాచారం ఆన్ లైన్, గూగుల్ లింక్, దేవస్థానం వెబ్ సైట్, ఆఫ్ లైన్ నందు అందుబాటులో ఉంచాలని అన్నారు. అర్హులైన వారికి.. కోడెలు, ఆవులు ఏ విధంగా పంపిణీ చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పంపిణీ చేసిన పశువులను సైతం కొన్ని రోజులు పశుసంవర్ధక శాఖ నుంచి వైద్యులు వెళ్లి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. దేవస్థానం పంపిణీ చేసిన కోడెలు, ఆవుల పట్ల హింసకు పాల్పడినా, నిర్లక్ష్యం వహించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

Show comments