Dharani
Karimnagar-Student, Job With Rs 52 Lakh Per Annum: ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి.. మరి ఎంఎన్‌సీలో ఏడాదికి ఏకంగా అరకోటి జీతంతో ఉద్యోగం సాధించింది ఓ యువతి. ఆ వివరాలు..
Karimnagar-Student, Job With Rs 52 Lakh Per Annum: ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి.. మరి ఎంఎన్‌సీలో ఏడాదికి ఏకంగా అరకోటి జీతంతో ఉద్యోగం సాధించింది ఓ యువతి. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా చదువుకునే యువతీ యువకులు కలలు కనేది బాగా చదువుకుని.. మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగం లేదంటే ప్రభుత్వ కొలువు సాధించడం. అయితే అందరూ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేరు. ఎవరైతే పట్టుదలగా ప్రయత్నిస్తారో వారు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇక వారే చాలా మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఇక ఇలాంటి అరుదైన ఘనత సాధించే వారిలో యువతులు ఉండటం మరింత గర్వకారణంగా భావిస్తారు. తాజాగా మీకు అలాంటి అరుదైన ఘనత సాధించిన ఓ యువతిని పరిచయం చేయబోతున్నాం. రైతు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టం చూసిన ఆ యువతి.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఏకంగా ఇస్రోలో వచ్చిన జాబ్ ఆఫర్‌ను కూడా వదులుకుంది. ఆ తర్వాత ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలు..
ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి మరీ.. ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించింది. ఆ యువతి సాధించిన విజయాన్ని చూసి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. ఆ వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన ఆశ్రిత అనే యువతి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి చదువు గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ బిడ్డను మాత్రం కోరుకున్న చదువు చదివించాలని భావించారు. ఇక ఆశ్రిత కూడా చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఊరికి సమీపంలోని జ్యోతిష్మతి కాలేజీలో బీటెక్‌లో చేరింది. అక్కడే అందరికి భిన్నంగా ఆలోచించింది ఆశ్రిత. బీటెక్ చేసిన వారు, మరీ ముఖ్యంగా అమ్మాయిలు సాఫ్ట్‌వేర్ జాబ్‌పై ఆసక్తి చూపుతారు. కానీ ఆశ్రిత మాత్రం అందుకు భిన్నంగా హార్డ్‌వేర్ ఫీల్డ్‌ను ఎంచుకుంది.
సాఫ్ట్‌వేర్‌ను వద్దనుకుని.. ఐఐఐటీల్లో ఎంటెక్ చేయాలని భావించింది. గేట్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంది. దానిలో భాగంగా కరీంనగర్‌లో ఉచిత కోచింగ్ ఇస్తోన్న ఓ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యింది. తొలి ప్రయత్నంలో మంచి ర్యాంక్ రాకపోవడంతో.. మరోసారి రాసింది. అలా 2022లో గేట్‌లో 36వ ర్యాంకు తెచ్చుకుంది. 2024లో ఎంటెక్ పూర్తయ్యింది. కాలేజ్ ప్లేస్‌మెంట్‌లో ఎన్విడియా కంపెనీ నుంచి ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించింది. గేట్‌లో 36వ ర్యాంక్ రావడంతో.. ప్రతిష్టాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో, డీఆర్‌డీఓ, బార్క్‌లలో జాబ్ అవకాశాలు తలుపు తట్టాయి. అయినా వద్దనుకుంది. ఇక తాజాగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా మంచి అవకాశాలు అందుకోవచ్చని నిరూపించింది ఆశ్రిత. ఆమె సాధించిన విజయం చూసి ఆశ్రిత తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.