iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: తీహార్ జైల్లో కవితకు అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

K Kavitha Health Issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై... తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసింది.

K Kavitha Health Issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై... తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసింది.

బ్రేకింగ్: తీహార్ జైల్లో కవితకు అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అస్వస్థకు గురయ్యారు.  తీహార్ జైలులో ఉన్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు ఆమెను దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు నాలుగు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టైన లిక్కర్ స్కాం గురించి అందరికి తెలిసింది. దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం  సంచలనం సృష్టించింది. అంతేకాక ఈ కేసు ఊహించని పరిణమాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులోనే కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో కవిత పలు సార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను హాజరైంది. ఈ క్రమంలోనే ఆమెను నిందితురాలిగా చేర్చింది సీబీఐ. టోకు వర్తకులకు అధిక లాభాలు పొందేలా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ విధానాన్ని రూపొందించింది. ఈ పాలసీలో ఎన్నో అవకతవకలు జరగడంతో ఈ పాలసీని రద్దు చేసింది. కానీ ఇప్పటికే 2022 ఆగస్టు 17న సీబీఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

అప్పటి నుంచి ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా వంటి కీలక వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అదుపులోకి ..అనంతరం అరెస్టు చేశారు. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సీబీఐ అరెస్ట్‌ చేసి విచారించింది. అందులో కవితకు సన్నిహితులైన బోయినపల్లి అభిషేక్‌, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, శరత్‌ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబును కూడా అరెస్ట్‌ చేసింది సీబీఐ. మొత్తంగా దాదాపు నాలుగు నెలల నుంచి కవిత తీహార్ జైల్లో ఉంది. పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్న కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమె మంగళవారం సాయంత్రం  తీవ్ర అస్వస్థతకు గురైంది. దయాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి