రియల్ హీరో.. వరదల్లో పోతే ఒక్కడిని.. వస్తే పది మందితో వస్తా అంటూ..

Khammam: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలకు కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. కొన్ని గ్రామాలకు పూర్తిగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

Khammam: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలకు కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. కొన్ని గ్రామాలకు పూర్తిగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడ చూసినా వర్షం సృష్టిస్తున్న బీభత్సమే కనిపిస్తుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా తేరుకోలేదు. తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. 11 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని ఓ జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. వివరాల్లోకి వెళితే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. మున్నేరు వాగును చూసేందుకు కొంతమంది పర్యాటకులు వెళ్లారు. కానీ దురదృష్టం కొద్ది మున్నేరు ఉధృతి ఎక్కువ కావడవంతో బ్రిడ్జీపై చిక్కుకుపోయారు. చుట్టూ వరద నిండిపోవడంతో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. దాదాపు 9 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో అటుగా వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు.

ఆ సమయంలో వారికి అండగా జైసీబీ డ్రైవర్ నిలిచాడు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జీపైనే సుమారు 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న తొమ్మిది మంది కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలు చేస్తుంది. హెలికాప్టర్లు పంపించి కాపాడేందుకు వాతావరణ పరిస్థితి బాగాలేదు. ఇక తమ ప్రాణాలు పోయినట్లే అని తొమ్మిది మంది ఆశ వదులుకున్నారు. ఆ సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని ఎలాగైనా కాపాడాలని అధికారులను ఆదేశించారు. కానీ అటుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు.

ఆ సమయంలో వారిని ఎలాగైనా రక్షించాలని జేసీబీ డ్రైవర్ అనుకున్నాడు. అంత భయంకరమైన వరదను ఎదిిరించి ప్రమాదం అని తెలిసి.. అధికారులు వారిస్తున్నా వారిని కాపాడేందుకు ముందుకు దూకాడు. పోతే ఒక్కన్నే పోతాను.. వస్తే తనతో కలిసి పది మందిమి కలిసి వస్తామని చెప్పి ముందుకు కదిలాడు. జాగ్రత్తగా వారి వద్దకు వెళ్లి సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అంత వరదల్లో ప్రాణాలకు తెగించి వారిని బయటకు తీసుకువచ్చిన జేసీబీ డ్రైవర్ ని రియల్ హీరో అంటూ జేజేలు పలికారు.

Show comments