iDreamPost
android-app
ios-app

Pagala Sampath Reddy: బ్రేకింగ్: గుండెపోటుతో BRS జెడ్పీ ఛైర్మన్ మృతి!

  • Author Soma Sekhar Updated - 08:09 PM, Mon - 4 December 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిన కొన్ని గంటల్లోనే జనగామా జిల్లా BRS పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఓ జెడ్పీ ఛైర్మన్ గుండెపోటుతో మరణించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిన కొన్ని గంటల్లోనే జనగామా జిల్లా BRS పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఓ జెడ్పీ ఛైర్మన్ గుండెపోటుతో మరణించారు.

  • Author Soma Sekhar Updated - 08:09 PM, Mon - 4 December 23
Pagala Sampath Reddy: బ్రేకింగ్: గుండెపోటుతో BRS జెడ్పీ ఛైర్మన్ మృతి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిన కొన్ని గంటల్లోనే జనగామా జిల్లా BRS పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. జనగామా జిల్లా పరిషత్ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో సోమవారం మరణించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం సంపత్ రెడ్డి జనగామా జిల్లా భారాసా అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న పార్టీ శ్రేణులకు ఈ వార్త షాక్ కు గురిచేసింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. హ్యాట్రిక్ కొట్టేస్తామని ఎంతో ధీమాతో ఉన్న ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలు ఈ ఫలితాలు గట్టి షాక్  ఇచ్చాయి.  2023 తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేసింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లు మాత్రం గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామా, స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది.

ఒక పక్కన జనగామాలో బీఆర్ఎస్ గెలిచిన సంతోషం ఒకవైపు ఉన్నా.. పార్టీ ఓడిపోవడంతో స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోయారు.  ఈ ఇదే బాధలో ఉన్న జనగామా జిల్లాలోని గులాబీ శ్రేణులకు మరో చేదు వార్త వినిపించింది.  జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మృతి..బీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురి చేసింది.  బీఆర్ఎస్ పార్టీ కోసం సంపత్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇటీవలే ఎన్నికల ప్రచారం ఆయన చాలా యాక్టీవ్ గా పని చేశారు. సంపత్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.