iDreamPost
android-app
ios-app

సాయం చేయబోయి జైలు పాలైన తెలుగు వ్యక్తి!

ఎదుటి వారికి సాయం చేయడం అనేది దైవ పూజ లాంటిది. అయితే కొన్ని సార్లు మనం చేసే సాయం మనల్నే ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా సాయం చేయబోయిన తెలంగాణ వ్యక్తి జైలు పాలయ్యాడు.

ఎదుటి వారికి సాయం చేయడం అనేది దైవ పూజ లాంటిది. అయితే కొన్ని సార్లు మనం చేసే సాయం మనల్నే ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా సాయం చేయబోయిన తెలంగాణ వ్యక్తి జైలు పాలయ్యాడు.

సాయం చేయబోయి జైలు పాలైన తెలుగు వ్యక్తి!

సమాజంలో సాయం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. తోటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నా కూడా పట్టించుకునే వారే కరువుతున్నారు.  అందుకు గల కారణాలు అనేకం ఉంటాయి. అయితే కొందరు మాత్రం సాయం చేయడానికి ఎప్పుడు ముందే ఉంటారు. ఎదుటి వారికి సాయం చేయడంలోనే వారు ఆనందం పొందుతుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు.. ఎదుటి వారికి సాయం చేయడానికి వెళ్లి..చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఓ తెలుగు వ్యక్తి విషయంలో జరిగింది. సాయం చేయబోయి..జగిత్యాలకు చెందిన ఓ  వ్యక్తి జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా  పొలాస గ్రామానికి చెందిన బద్దెనపల్లి శంకరయ్య అనే వ్యక్తి  సౌదీలో ఉంటున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సౌదీకి వెళ్లి.. అక్కడే పని చేసుకుంటున్నాడు. శంకరయ్యా అక్కడ పనిచేస్తూ.. కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించే వాడు. గత నెల  12న కొలంబో విమానంలో భారతదేశానికి  బయలు దేరాడు.  అదే విమానంలో ఇతర దేశాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు. అలానే శ్రీలంకాకు చెందిన ఓ మహిళ.. తన ఇద్దరు పిల్లలతో అదే విమానంలో ప్రయాణం చేసింది. ఆ మహిళ పిల్లల్లో ఓ చిన్నారికి శంకరయ్య దుప్పటి కప్పే ప్రయత్నం చేశాడు. దీంతో దానిని తప్పుగా  భావించిన సదరు మహిళ సీరియస్ అయ్యింది.

అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విమాన సిబ్బందికి  ఆ పాప తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో శంకరయ్యను శ్రీలకం పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా జమానత్ ఇచ్చేవారు లేకపోవండతో  కేసు ముగిసే వరకు శ్రీలంకలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీలంకలో చిక్కుకున్న శంకర్ ను జైలు నుంచి విడిపించాలని అతడి తల్లి కోరుకుంటుంది. తన బిడ్డ స్వదేశానికి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సాయం అందించాలని ఆయన భార్య గంగలక్ష్మి, కుమారుడు గంగమమల్లు, కూతురు శ్రీలక్ష్మి రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

శంకరయ్యా లాగానే గల్ఫ్  దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు నరకయాతన అనుభవిస్తుంటారు. అక్కడి ఓనర్లు పెట్టే హింసలను కుటుంబాల కోసం భరిస్తూ ఉండి పోతారు. మరికొందరు అయితే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. శంకరయ్యా లాగా అక్రమంగా అరెస్టై.. అక్కడి జైల్లలో మగ్గుతున్నారు. మరి… శంకరయ్య విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సాయం చేయాలని ఆయన బంధువులు వేడుకుంటున్నారు. మరి.. సాయం చేయబోయి.. జైలు పాలైన శంకరయ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.