Dharani
తెలంగాణలో ఓ వైపు రాజకీయ పార్టీలన్ని ఎన్నికల కోసం సిద్ధమవుతుండగా.. మరో వైపు మాత్రం ఐటీ సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతుండటం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
తెలంగాణలో ఓ వైపు రాజకీయ పార్టీలన్ని ఎన్నికల కోసం సిద్ధమవుతుండగా.. మరో వైపు మాత్రం ఐటీ సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కొనసాగుతుండటం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ హైరాబాద్‌లో ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులే టార్గెట్‌గా భాగ్యనగరంలో సోదాలు జరగుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్) ఇంట్లో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఆయన నివాసం, కార్యాలయాల్లో వరుస తనిఖీలు చేపట్టారు. అలానే మరో కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత నర్సింహ్మా రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 5 గంటల నుంచే ఆమె ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఆమెకు సంబంధించిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఇక ఐటీ దాడులో జరిగే సమయంలోపారిజాత తిరుపతిలో ఉండగా.. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం పారిజాత బడంగ్‌పేట మేయర్ ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ ఆమెకు మొండి చేయి ఎదురయ్యింది. ఆ టికెట్ పొందటం కోసం టీపీసీసీ రేవంత్ రెడ్డికి ఆమె రూ.10 కోట్ల నగదు, రూ.5 ఎకరాల భూమి ఇచ్చారని ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ రైడ్స్ జరగటం కలకలం రేపుతోంది.
ఇదిలా ఉండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఐటీ దాడులు నిర్వహించటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పోలీసులు ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్లో తరలిస్తున్న డబ్బును, విలువైన వస్తువులను సీజ్ చేస్తున్నారు. అయితే ఇలా ఎన్నికల సన్నాహాల్లో ఉన్న రాజకీయ నాయకుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరగటం తెలంగాణలో ఇదే తొలిసారిగా తెలుస్తోంది. అయితే ఈ రైడ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.