ఐటీ ఉద్యోగులకు పోలీసుల కీలక సూచనలు.. ఈ మూడు పాటించాల్సిందే..!

  • Author singhj Published - 09:35 PM, Tue - 25 July 23
  • Author singhj Published - 09:35 PM, Tue - 25 July 23
ఐటీ ఉద్యోగులకు పోలీసుల కీలక సూచనలు.. ఈ మూడు పాటించాల్సిందే..!

ఉభయ తెలుగు రాష్ట్రాలను వానలు వీడటం లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్​ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భాగ్యనగరంలో సోమవారం సాయంత్రం గంట పాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. అర్ధరాత్రి వరకు ఓ మోస్తరు వాన కొనసాగుతూనే ఉంది. అంతేగాక నగరంలో మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు సుమారు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 3 దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఇక, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా జూబ్లీహిల్స్, అమీర్​పేట ప్రాంతాల్లో అంబులెన్స్​లకు కూడా దారి దొరకలేదు. ఆఫీసులు మూతపడే టైమ్​లో వాన కురవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భారీ వర్షాల వల్ల నగరంలోని అత్తాపూర్, శివరాంపల్లి, హైటెక్​సిటీ, మలక్​పేట, రైల్వే స్టేషన్, నాగోల్, నాగోల్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని రోడ్ల మీద నడుములోతు నీటితో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రణాళిక రూపొందించారు.

ఐటీ ఉద్యోగులకు సైబరాబద్ పోలీసులు చేసిన కీలక సూచనలివే..

ఫేజ్​-1

ఐకియా స్టోర్ నుంచి సైబరాబాద్​ టవర్స్ వరకు ఉండే ఐటీ కార్యాలయాలు సాయంత్రం 3 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలి.

ఫేజ్​-2

ఐకియా స్టోర్ నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఆఫీసులు అన్నీ సాయంత్రం 4.30 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలి.

ఫేజ్​-3

గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు అన్నీ సాయంత్రం 3 గంటలకు లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Show comments