IRS Officer As MGNREGA Worker At Suryapet: ఉపాధి కూలీగా మారిన IRS అధికారి.. చేతులు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా.. మీరు గ్రేట్‌ సార్‌

ఉపాధి కూలీగా మారిన IRS అధికారి.. చేతులు బొబ్బలెక్కినా లెక్కచేయకుండా.. మీరు గ్రేట్‌ సార్‌

ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఏసీ క్యాబిన్‌లో కూర్చుని పని చేయాల్సిన వ్యక్తి.. ఉపాధి కూలీ అవతార ఎత్తి.. పలుగు పార చేతపట్టి.. మట్టి పని చేశాడు. అతడి సింప్లిసిటీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.

ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఏసీ క్యాబిన్‌లో కూర్చుని పని చేయాల్సిన వ్యక్తి.. ఉపాధి కూలీ అవతార ఎత్తి.. పలుగు పార చేతపట్టి.. మట్టి పని చేశాడు. అతడి సింప్లిసిటీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.

జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వారు.. తాము నడిచి వచ్చిన మూలాలను మర్చిపోరు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉంటారు. అలాంటి వారినే విజయం వరిస్తుంది.. కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. తాను ఎక్కి వచ్చిన మెట్లను మర్చిపోని వ్యక్తి.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు అంటారు పెద్దలు. ఈ మాటలు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మనసులో బలంగా నాటుకుపోయాయి. జీవితంలో మంచి ఉద్యోగం సాధించి.. ఉన్నత శిఖరాలకు ఎదిగినా సరే.. తన మూలాలను మర్చిపోలేదు. కాయకష్టం చేసుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆ వ్యక్తి.. మట్టి మనుషులను చూడగానే వారిలో ఒకడిగా కలిసిపోయి.. పలుగు పార చేత పట్టి.. పని చేయడం ప్రారంభించాడు. ఐఆర్‌ఎస్‌ అధికారి అయి ఉండి.. తమతో కలిసి మట్టి పనులు చేస్తోన్న ఆ వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..

ఈ సంఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్‌ భాగ ఐఆర్‌ఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సౌత్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌గా.. జీఎస్‌టీ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా స్వగ్రామం వచ్చిన సందీప్‌.. నూతనకల్‌ మండలం, చిల్పకుంట్లలో ఉపాధిహామీ కింద చెరువు పూడికతీత పనులు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.

ఈ క్రమంలో డీఆర్డీవో అనుమతితో సోమవారం ఉదయం అక్కడకు వెళ్లాడు సందీప్‌. కూలీలతో కలిసి పని చేశాడు. పలుగు పట్టి మట్టి తవ్వి.. పారతో ఎ‍త్తి తట్టలో పోసి.. ట్రాక్టర్‌లో నింపి.. అక్కడ నుంచి రైతు పొలానికి చేర్చడం వరకు అన్ని పనులను కూలీలతో సమానంగా చేశాడు. అలవాటు లేని పనులు కావడంతో సందీప్‌ చేతికి బొబ్బలు వచ్చినా లెక్క చేయలేదు.

ఆ తర్వాత కూలీలతో కలిసి అక్కడే భోజనం చేశాడు సందీప్‌. వారితో మాట్లాడుతూ.. వారికి అందుకున్న వేతనం, ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నాడు. తనకు కష్టం విలువ తెలుసని.. తనది మధ్యతరగతి కుటుంబం అని.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చాడు. అందుకే కూలీల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఉపాధి పనికి వచ్చానని వెల్లడించాడు. అంత గొప్ప అధికారి తమతో సమానంగా పని చేయడం చూసిన కూలీలు ఆశ్చర్యపోతున్నాడు. మీరు నిజంగా చాలా గ్రేట్‌ సార్‌ అంటూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show comments