iDreamPost
android-app
ios-app

చైతన్య- నారాయణ చదువు పిల్లలను గొర్రెలను చేస్తోంది.. IPS CV ఆనంద్ ఎమోషనల్!

IPS Officer CV Aanand: ఇంటర్ ఫలితాలు కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

IPS Officer CV Aanand: ఇంటర్ ఫలితాలు కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

చైతన్య- నారాయణ చదువు పిల్లలను గొర్రెలను చేస్తోంది.. IPS CV ఆనంద్ ఎమోషనల్!

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. చాలా మంది విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారు. వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లి విరిశాయి. కానీ, ఎవరైతే ఫెయిలయ్యారో.. వారిలో ఏడుగురు విద్యార్థులు బవలన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు తిడతారనో, బంధువులు వెక్కిరిస్తారనో.. కష్టపడి చదివిస్తే పాస్ కాలేకపోయారా అని ప్రశ్నిస్తారనో.. కారణం ఏదైనా ఏడుగురు విద్యార్థులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించేసుకున్నారు. కన్న తల్లిదండ్రులు కడుపు కోత గురించి కూడా వాళ్లు ఆలోచించలేదు. అయితే ఈ విషాదకర ఘటనపై ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఐపీఎస్ అధికారి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు.

ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాలు వచ్చిన సమయంలో ఆనందకర వార్తలు ఎలా వింటామో.. కొందరు విద్యార్థులు తీసుకునే దారుణమైన నిర్ణయాల గురించి కూడా వింటూనే ఉంటాం. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత గంటల వ్యవధిలో ఏడుగురు విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు. ఈ వార్తలు విని అంతా ఎమోషనల్ అవుతున్నారు. ఓ నెటిజన్ నీరదారెడ్డి రికమెండేషన్స్ ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ చేశారు. దానికి సీవీ ఆనంద్ స్పందించారు. ఆ పోస్టును రీపోస్ట్ చేస్తూ.. ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలా మెలగాని అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

“ఈ వార్త చదువుతుంటే నా గుండె తరుక్కు పోయింది. ఏడుగురు విద్యార్థులను తమ జీవితాను అర్ధాంతరంగా ముంగిచారు. ఈ విద్యా విధానం, తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల క్రితం చైతన్య- నారాయణ పేరిట ఒక శాపగ్రస్తమైన కార్పొరేట్ విద్యా విధానాన్ని ప్రారంభించారు. వారి విద్యా విధానం విద్యార్థులను చిన్నగా గొర్రెలుగా మార్చేస్తోంది. నేను పేరెంట్స్ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పరీక్షలే వారి జీవితాలకు ముగింపు కాదు అని గ్రహించండి. జీవితం చాలా పెద్దది. మ్యాథ్స్- కెమిస్ట్రీ మాత్రమే కాకుండా.. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి వారి వారి టాలెంట్స్ కి తగినట్లు బతికే అవకాశం ఉంటుంది.

తల్లిదండ్రులు కూడా కాస్త పెద్ద మనసు చేసుకుని పిల్లలను ఆలోచించే విధంగా పెంచాలి. మానసిక ఒత్తిడి, పరీక్షలో మార్కులు రాకపోతే ప్రాణాలు తీసుకోవాలి అనే తరహాలో పెంచకండి. ఇది నిజంగా బాధించే అంశమే కాదు.. సిగ్గు చేటు కూడా” అంటూ సీవీ ఆనంద్ పోస్ట్ చేశారు. నిజంగానే ప్రతి తల్లిదండ్రులు ఈ అంశంపై దృష్టి సారించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలి అనే ఆలోచన విద్యార్థులకు కలిగింది అంటే.. అది తల్లిదండ్రుల వైఫల్యమే అంటున్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు అనే విషాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తు పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు.