iDreamPost
android-app
ios-app

Shamshabad Airport: గాల్లో ఉన్న విమానంలో సాంకేతి లోపం.. 160 మంది!

పలు సందర్భాల్లో విమానాల్లో సాంకేతి లోపాలు తలెత్తుతుంటాయి. అయితే వాటి ఫైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటపడేలా చేస్తారు. తాజాగా శంషాబాద్ లోనూ 160 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానంలో సాంకేతి సమస్య ఏర్పడింది.

పలు సందర్భాల్లో విమానాల్లో సాంకేతి లోపాలు తలెత్తుతుంటాయి. అయితే వాటి ఫైలెట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటపడేలా చేస్తారు. తాజాగా శంషాబాద్ లోనూ 160 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానంలో సాంకేతి సమస్య ఏర్పడింది.

Shamshabad Airport: గాల్లో ఉన్న విమానంలో సాంకేతి లోపం.. 160 మంది!

ఏదో ఒక ప్రాంతంలో విమానాలు, హెలికాఫ్టర్లకు సంబంధించిన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.  సాంకేతిక లోపం, ఇతర సమస్యల కారణంగా ఫ్లైట్ ప్రమాదానికి గురవుతుంటాయి. ఈ క్రమంలో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. ఇటీవలే జరిగిన కొన్ని ప్రమాదాలే అందుకు ఉదాహరణ. గతేడాదిలో నేపాల్లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చెందారు. అలానే  ఆతరువాత ఇండియాలో జరిగిన పలు హెలికాఫ్టర్ ప్రమదాల్లో కొందరు మరణించారు. రెండు రోజుల క్రితం కూడా మహారాష్ట్రలోని ఓ శివసేన పార్టీ నేత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అదృష్టం బాగుండి.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాజాగా  హైదరాబాద్ నుంచి 160 మందితో కోల్ కత్తా వెళ్తున్న విమానంలో సాంకేతి సమస్య తలెత్తింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శనివారం హైదరాబాద్ నుంచి కోల్ కతాకు ఇండిగో విమానం వెళ్లాల్సి ఉంది. అందులో ప్రయాణించేందుకు 160 మంది ఉన్నారు. ఇక 160 మందితో హైదరాబాద్ నుంచి కలకత్తాకు ఇండిగో విమానం బయలు దేరేందుకు సిద్ధమైంది. ఇత విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. టేక్ ఆఫ్ అవుతుండగా కుడివైపు ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఫైలెట్ తెలిపారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఫైలెట్ టెకాప్ అయిన విమానాన్ని వెంటనే తిరిగి అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఇంజన్ లో సాంకేతిక లోపం గుర్తించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో 160 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా సాంకేతి సమస్యలు తలెత్తి తృటిలో పెను ప్రమాదాల నుంచి ఎంతో మంది తప్పించుకున్నారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుందనగా ప్రమాదానికి గురై.. ఎంతో మంది మృతి చెందారు. ఇంకా దారుణం ఏమిటో అమెరికా ప్రాంతంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో పదుల సంఖ్యలో మరణించారు. గాల్లో ఉండగ పేలిపోవడంతో ఆ శకలాలు సముద్రంలో పడిపోయాయి. అలానే నేపాల్ లో సైతం ఓ విమానం కొండను ఢీకొట్టి పేలిపోయింది. ఈ ఘటనలో 72 మంది చనిపోయారు. తాజాగా శంషాబాద్ లో జరిగిన ఈ విమాన సమస్యలో మాత్రం అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.